EAPCET and E CET Dates Changed : లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈఏపీ సెట్, ఐసెట్ తేదీలను మారుస్తూ ఉన్నత విద్యా మండలి నూతన షెడ్యూల్ విడుదల చేసింది. మే 9 నుంచి 12 వరకు జరగాల్సిన ఈఏపీ సెట్‌ను మే 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నట్టు పేర్కొంది. అగ్రికల్చర్, ఫార్మా ప్రవేశ పరీక్షలు 7, 8 తేదీల్లో, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు 9 నుంచి 11 వరకు జరగనున్నాయి. జూన్ 4, 5 తేదీల్లో జరగనున్న ఐసెట్ పరీక్షలు, జూన్ 5, 6 తేదీల్లో నిర్వహించనుంది. మే 13 నుంచి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయించినట్టు ఉన్నత విద్యా మండలి పేర్కొంది.
పాలిసెట్ వాయిదా : రాష్ట్రంలో పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పాలిసెట్) వాయిదా వేస్తున్నట్లు ఈ నెల 20న విద్యా శాఖ ప్రకటించింది. చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను వాయిదా వేస్తున్నట్లు వివరించింది. మే 17న పాలిసెట్ పరీక్ష జరగాల్సి ఉండగా, మే 24న నిర్వహించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఈఏపీసెట్ షెడ్యూలు విడుదల - ఈ నెల 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఫిబ్రవరి నెలలో పాలిసెట్ నోటిఫికేషన్ (Policet Notification) వెలువడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 22 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్) సీట్లను పాలిసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 24 వరకు, రూ.300 ఆలస్య రుసుంతో ఏప్రిల్ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
TS Polycet Counselling New Shedule : పాలిటెక్నిక్ కోర్సుల్లో సీట్లు పెంపు.. తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్లో మార్పు
మే 13న లోక్‌సభ ఎన్నికలు : ఇదిలా ఉండగా రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలు, 1 అసెంబ్లీ స్థానానికి మే 13న ఎన్నికల జరగనున్నాయి. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ వెలువడటంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.
తొలి లోక్‌సభ ఎన్నికలు జరిగి 73 ఏళ్లు- అప్పుడు 14, ఇప్పుడు 6- ఏంటీ కథ? - Loksabha Election National Parties