తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓఆర్​ఆర్​ వెలుపల ఫార్మా క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం : ఉపముఖ్యమంత్రి భట్టి - DY CM Bhatti Vikramarka On Pharma

DY CM Bhatti Vikramarka On Pharma Industry : నగరం నుంచి విదేశాలకు భారీ స్థాయిలో ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఫార్మా క్లస్టర్లను బాహ్యవలయ రహదారి వెలుపల ఏర్పాటు చేస్తామని తెలిపారు. హైటెక్స్​లో ఇండియన్ ఫార్మాసూటికల్ సదస్సులో పాల్గొన్న ఆయన రాష్ట్ర ఫార్మారంగ స్థితిగతులపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్​ బాబు, కోమటిరెడ్డి హాజరయ్యారు.

By ETV Bharat Telangana Team

Published : Jul 5, 2024, 3:40 PM IST

DY CM Bhatti Vikramarka On Pharma Industry
DY CM Bhatti Vikramarka On Pharma Industry (ETV Bharat)

DY CM Bhatti Vikramarka On Pharma Industry :హైదరాబాద్ నుంచి పెద్దఎత్తున విదేశాలకు ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైటెక్స్​లో ఇండియన్ ఫార్మాసూటికల్ సదస్సులో శ్రీధర్​బాబు, కోమటిరెడ్డిలతో కలిసి పాల్గొన్న ఆయన ఫార్మాసూటికల్​ రంగంపై మాట్లాడారు. ఫార్మా క్లస్టర్లను బాహ్యవలయ రహదారి వెలుపల ఏర్పాటు చేస్తామని వివరించారు. విద్యుత్​ రంగంలో కొత్త విధానాలు తీసుకువస్తామని ఆయన వెల్లడించారు.

Minister Sridhar Babu On Pharma Industry :ఔషధ తయారీ రంగానికి హైదరాబాద్​ నగరం కేంద్రంగా మారిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. దేశ, విదేశాలకు ఇక్కడి నుంచి ఫార్మా ఎగుమతులు జరుగుతున్నాయన్నారు. పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. పెట్టుబడిదారులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం కృత్రిమ మేధ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోందని ఆయన వివరించారు. ఏఐని అందిపుచ్చుకోవడానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా తెలిపారు.

Minister Komatireddy On CSR : వైఎస్ఆర్‌ హయాంలో బాహ్య వలయ రహదారిని(ఓఆర్​ఆర్) నిర్మించామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఫలితంగా హైదరాబాద్‌కు ఎన్నో ఐటీ పరిశ్రమలు వచ్చాయన్నారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) నిర్మాణం కూడా చేపట్టాలని కేంద్రప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. పారిశ్రామిక వేత్తలకు తగిన ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పారిశ్రామికవేత్తలు సీఎస్ఆర్‌ (కార్పొరేట్​ సామాజిక బాధ్యత)లో భాగంగా తోడ్పాటు అందించాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కోరారు.

'హైదరాబాద్​లో ఆస్తులు కొంటే భద్రత'కు భరోసా ఇస్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సంపద సృష్టించే వారిని ఎప్పుడూ గాయపరచం : భట్టి విక్రమార్క

ABOUT THE AUTHOR

...view details