ETV Bharat / state

హైదరాబాద్​ టు గోవా డైరెక్ట్​ ట్రైన్ స్టార్ట్​ - టైమింగ్స్​తో పాటు పూర్తి వివరాలు మీకోసం - KISHAN REDDY TO INAUGURATEd TRAIN

పట్టాలెక్కిన సికింద్రాబాద్​ - గోవా రైలు - వారంలో రెండు రోజులు సర్వీసులు

author img

By ETV Bharat Telangana Team

Published : 2 hours ago

Kishan Reddy To Inaugurated Train To Goa
Kishan Reddy To Inaugurated Train To Goa (ETV Bharat)

Kishan Reddy To Inaugurate Train To Goa : ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లాలనుకునే వారి సౌలభ్యం కోసం మరో రైలును రైల్వేశాఖ ప్రారంభించింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ - వాస్కోడిగామా రైలును ప్రకటించింది. ఇవాళ్టి నుంచి సికింద్రాబాద్ - గోవా రైలు పట్టాలెక్కింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి జెండా ఊపి రైలును ప్రారంభించారు. వారంలో రెండు రోజుల పాటు ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా వెళ్లే రైలు బుధ, శుక్రవారాల్లో అందుబాటులో ఉంటుంది.

సమయాలివే : ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు వాస్కోడిగామా చేరుకుంటుంది. వాస్కోడిగామా నుంచి సికింద్రాబాద్​కు గురు, శనివారాల్లో అందుబాటులో ఉంటుంది. ఉదయం 9 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ఏయే స్టేషన్లలో ఆగనుందంటే : కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్​నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్హెమ్, మడగావ్ స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో ఫస్ట్ ఏసీ, 2 ఏసీ, 3 ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్​లు ఉంటాయి. ఈ నెల 4వ తేదీ నుంచి టికెట్ల బుకింగ్​కు అనుమతించినట్లు అధికారులు తెలిపారు. ఇవాళ మాత్రం ఉదయం 11.45 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు గోవా (వాస్కోడిగామా) చేరుకుంటుంది.

గోవా వెళ్లేవారిలో 20 శాతం మంది తెలుగువారే : ఏటా సుమారు 80 లక్షల మంది స్వదేశీ పర్యాటకులు గోవాను సందర్శిస్తుండగా, ఇందులో 20 శాతం మంది తెలుగు రాష్ట్రాల వారే ఉండటం విశేషం. నేరుగా రైళ్లలో వెళ్లే సదుపాయం లేక సొంత వాహనాలను, ప్రత్యామ్నాయ మార్గాల్లో అక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం వారానికి ఒక రైలు 10 బోగీలతో సికింద్రాబాద్ నుంచి బయల్దేరి గుంతకల్ చేరుకుని, అక్కడ తిరుపతి నుంచి గోవాకు వెళ్లే మరో 10 బోగీలతో కలిపి గోవాకు ప్రయాణం సాగిస్తోంది. తాజాగా ఈ కొత్త రైలు రాకతో ఇక మధ్యలో దిగే పనిలేకుండా, నేరుగా గోవాకు చేరుకోవచ్చు.

గోవా ట్రిప్​ ప్లాన్​ చేస్తున్నారా? సికింద్రాబాద్​ నుంచి డైరెక్ట్​ ట్రైన్ - వివరాలివే​ - Hyderabad To Goa Special Train

గోవా టూర్​ ప్లాన్​ చేస్తున్నారా? - సికింద్రాబాద్ నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉందని మీకు తెలుసా? - SECUNDERABAD TO GOA DIRECT TRAIN

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.