ETV Bharat / offbeat

మీకు ఎంతో ఇష్టమైన డ్రెస్​ రంగు పోతోందా? - ఈ జాగ్రత్తలు పాటిస్తే మెరుపు తగ్గదు! - Washing Clothes Tips and Tricks - WASHING CLOTHES TIPS AND TRICKS

Washing Clothes Tips and Tricks: ఎంతో ఇష్టంగా తీసుకున్న డ్రెస్​ రంగు వెలిసిపోతే బాధగా ఉంటుంది. అయితే.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే బాగుంటుందని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

washing clothes tips and tricks
washing clothes tips and tricks (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 6, 2024, 12:28 PM IST

Washing Clothes Tips and Tricks: కొత్త దుస్తులు కొన్నప్పుడు తళతళా మెరిసిపోతుంటాయి. కానీ.. కొద్ది రోజుల తర్వాత అవి రంగు మారిపోతుంటాయి. ఇలా జరగకుండా దుస్తులు ఎక్కువ కాలం మన్నాలంటే.. కొత్తవాటిలా మెరిసిపోవాలంటే వాటిని ఉతికే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

చల్లని నీటిలోనే ఉతకాలి
మనలో చాలామంది బాగా మురికిగా ఉండే బట్టలను వేడి నీళ్లలో నానబెట్టి ఉతుకుతారు. మురికి ఎక్కువగా ఉన్న వాటికి ఈ చిట్కా బాగానే ఉపయోగపడుతుంది. కానీ.. వాటితో పాటే మిగతా దుస్తుల్ని కూడా వేడినీటితో ఉతకడం వల్ల వాటి నాణ్యత దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. కొన్ని దుస్తులకైతే దారాలు పోగులు బయటికొచ్చి ముడుచుకుపోతుంటాయని చెబుతున్నారు. కాబట్టి.. సాధ్యమైనంత వరకు దుస్తుల్ని చల్లటి నీటిలో నానబెట్టి ఉతకడం మంచిదని సలహా ఇస్తున్నారు.

తిరగేసి ఆరేయాలి!
బట్టలు ఉతికే సమయంలో తప్పనిసరిగా లోపల, బయట రెండువైపులా శుభ్రం చేయాలి. ముందు బయటి భాగం శుభ్రం చేసుకుంటే తర్వాత బట్టలు తిరగేసి లోపలి భాగం సులభంగా ఉతకచ్చని సలహా ఇస్తున్నారు. అలాగే ఉతికిన బట్టల్ని తిరగేసి, ముడతల్లేకుండా దులిపి ఆరేయాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల బట్టలు బాగా శుభ్రపడటమే కాకుండా ముఖ్యంగా ఎండకు రంగు కోల్పోకుండా ఉంటాయని వివరించారు. అవకాశం ఉంటే నీడలో ఆరేయాలని సూచిస్తున్నారు.

లేబుల్స్ చూసి ఉతకాలి
కొత్త బట్టలు కొన్నప్పుడు వాటితో కొన్ని లేబుల్స్ వస్తాయి. అయితే, ఇంటికొచ్చాక వాటిని కత్తిరించి పక్కన పడేయకుండా.. ముందు దాని మీద ఇచ్చిన వివరాలను ఓసారి చూడాలని సూచిస్తున్నారు. దీని వల్ల ఆ బట్టలను డ్రైవాష్ చేయాలా? లేక వాషింగ్‌మెషీన్‌లో వేయొచ్చా? లేక చేత్తో ఉతకాలా? నీడలో ఆరేయాలా లేక ఎండలోనా? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుస్తుంది. అలాగే వాటిని ఇస్త్రీ చేయచ్చా? లేదా? కూడా తెలుస్తుందని.. ఆ వివరాల ఆధారంగానే దుస్తుల్ని శుభ్రం చేస్తే అవి ఎక్కువ కాలం మన్నుతాయని అంటున్నారు.

ఇవి వాడొద్దు!
కొంత మంది బట్టలకు ఉన్న మురికి తొందరగా వదిలిపోయి అవి తళతళా మెరిసిపోవాలని ఉతికే నీళ్లలో క్లోరిన్, బ్లీచ్ వంటివి పదార్థాలను కలుపుతుంటారు. వీటి వాడకం వల్ల దారాల నాణ్యత తగ్గిపోయి.. ఫలితంగా బట్టలు త్వరగా చిరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే వీటికి బదులు వెనిగర్‌ను ఉపయోగించడం మంచిదదని సలహా ఇస్తున్నారు. వెనిగర్​ను వాడడం వల్ల దుస్తులకు కొత్త మెరుపునూ అందిస్తుందని అంటున్నారు.

మరకలు పడిన వెంటనే
మరో ముఖ్యమైన అంశం.. బట్టల మీద మరకలు పడిన వెంటనే వాటిని పోగొట్టే ప్రయత్నం చేయాలట. అలాకాకుండా ఉతికే సమయంలో చూసుకుందామని వదిలేస్తే అవి మరింత కఠినంగా మారి ఎంత రుద్దినా వదలవని చెబుతున్నారు. ఫలితంగా ఆ ప్రదేశంలో రంగూ కోల్పోయే ప్రమాదం ఉంటుందని వివరించారు.

గాఢత తక్కువగా సబ్బులు వాడాలి
ఇంకా బట్టలు ఉతకడానికి ఉపయోగించే సబ్బులు కూడా ఇందులో కీలకమని నిపుణులు అంటున్నారు. తక్కువ గాఢత కలిగిన సబ్బులను వాడడం మంచిదని చెబుతున్నారు. మురికి తొందరగా పోవాలని ఎక్కువ గాఢత ఉన్న సబ్బులు, డిటర్జెంట్లను ఎక్కువ మొత్తంలో వాడటం వంటివి చేయడం వల్ల దుస్తుల నాణ్యత దెబ్బతింటుందని వివరించారు.

ఇల్లు క్లీన్​ చేసే పని పెట్టుకున్నారా? - "బేకింగ్​ సోడా" మంత్రం వేయండి - చిటికెలో క్లీన్ అయిపోతుంది! - Baking Soda Cleaning Tips

పండక్కి వంటింట్లోని పాత్రలు క్లీన్ చేస్తున్నారా? - ఈ టిప్స్ పాటిస్తే తెల్లగా మెరవడం పక్కా! - Cleaning Tips for Dishes

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.