Drunken Father Kills Son in Vishakapatnam :తండ్రీకుమారుడి మధ్య మాటా మాటా పెరిగింది. అది పట్టరాని కోపంగా మారి, హత్యకు దారి తీసింది. ఏ తండ్రైనా కుమారుడిపై కోపం వస్తే మాములుగా రెండు, మూడు దెబ్బలు వేసి శాంతిస్తారు. కానీ మద్యం ఆ తండ్రి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. తలకెక్కిన మత్తు విచక్షణ మరిచిపోయేలా చేసింది. కనిపెంచిన కుమారుడిపై ఉన్మాదంగా దాడి చేయడానికి కారణమైంది. మత్తు దిగాక, మెలకువ వచ్చాక తాను ఎంతటి ఘోరానికి ఒడిగట్టాడో ఆ తండ్రికి తెలిసొచ్చింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. కుమారుడి నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది.
ఏపీలోని విశాఖపట్నం నర్సీపట్నంలో మద్యం మత్తులో కన్న కుమారుడిని తండ్రే హత్య చేసిన ఘటన ఆదివారం సంచలనం సృష్టించింది. సీఐ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం, విశ్రాంత ఆర్మీ ఉద్యోగి కఠారి రమణ నర్సీపట్నం లక్ష్మీనగర్‌లో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. భార్య సత్యవతి కొనేళ్ల కిందట మృతి చెందింది. వీరికి కుమారుడు, కుమార్తె పావని ఉన్నారు. తండ్రీ, కుమారుడు అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నారు. వారికి సమీప గ్రామంలో కుమార్తె పావని ఉంటుంది. ఆమె అప్పుడప్పుడు వారి దగ్గరికి వచ్చి యోగక్షేమాలు కనుక్కుని వెళ్తుంటుంది. వీరిద్దరికి వంట, ఇంటి పనులు చేసేందుకు పని మనిషి ఉంది.
పరువు హత్య! - ఇంటికి వస్తే ఘనంగా పెళ్లి చేస్తామన్నారు - చంపేసి పారిపోయారు!!