Drugs Caught in Guntur : బెంగళూరు నుంచి గుంటూరు, హైదరాబాద్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. 65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను సీజ్ చేశారు. ఎఈడీ బల్బ్‌లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ పేర్కొన్నారు. బల్బ్‌లో డ్రగ్స్‌ను రవాణా చేస్తున్నట్లుగా వచ్చిన సమాచారంతో తనిఖీలు చేపట్టి డ్రగ్స్‌ను సీజ్ చేశామని వివరించారు. డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న యూసఫ్, డోనాల్డ్ (టోనీ)లను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ అన్నారు.
65 గ్రాముల డ్రగ్స్ విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని ఎస్పీ తెలిపారు. వీరికి అవసరమైనంత డ్రగ్స్‌ను ఉంచుకుని మిగిలినది హైదరాబాద్‌లోని స్నేహితులకు పంపేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు 3 సార్లు డ్రగ్స్‌ను తరలించారని ఆ వివరాలను రాబట్టామని తెలిపారు. హైదరాబాద్‌లో ఎవరికి పంపుతున్నారనే వివరాలతో పాటుగా బెంగళూరులో వీరికి సరఫరా చేస్తున్న వారిని పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలను పంపామని అన్నారు. తల్లిదండ్రులు, సమాజంలోని వ్యక్తులు ఇటువంటి డ్రగ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ కోరారు.
Police Seize 148 kg of Ganja In AP :విశాఖ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా గుట్టురట్టయింది. గంజాయి మాఫియా గుట్టు చప్పుడు కాకుండా ఇతర రాష్ట్రాలకు మత్తు పదార్ధాలను సరఫరా చేస్తుంది. కారులో రవాణా చేస్తున్న గంజాయిపై సమాచారం అందుకున్న విజయవాడ పోలీసులు నిఘా వేశారు. రామవరప్పాడు రింగ్ రోడ్ వద్ద తనిఖీలు చేసి కారులో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి 10 లక్షల రూపాయల విలువ చేసే 148 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.