సిద్దిపేట నుంచి రష్యాకు నకిలీ యాంటీబయోటిక్స్ సరఫరా - రూ.1.50 కోట్ల మందులు సీజ్ - FAKE ANTIBIOTICS SEIZED AT SIDDIPET
నకిలీ మందుల గుట్టురట్టు - ప్రముఖ కంపెనీ పేరుతో ఫేక్ యాంటీబయోటిక్స్ తయారు చేస్తున్న జోడాస్ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
Published : Nov 27, 2024, 11:23 AM IST
|Updated : Nov 27, 2024, 11:29 AM IST
Fake Antibiotics Seized at Siddipet : సిద్దిపేట జిల్లా ములుగు మండలం కరకపట్ల గ్రామంలో భారీ ఎత్తున నకిలీ యాంటీబయోటిక్స్‌ను డ్రగ్ కంట్రోల్ బ్యూరో పట్టుకుని సీజ్ చేసింది. పట్టుబడిన నకిలీ యాంటీ బయోటిక్స్ డ్రగ్స్ విలువ రూ.1.50 కోట్లు ఉంటుందని డ్రగ్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. జోడాస్ ఎక్స్పో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ నకిలీ బయోటిక్స్ తయారు చేసి, ప్రముఖ కంపెనీలకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. రష్యాకు సైతం ఈ నకిలీ యాంటీ బయోటిక్స్‌ను విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నకిలీ ఔషధాలు తయారీకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.