ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరదలా సీఎంఆర్​ఎఫ్​కు విరాళాల వెల్లువ- చంద్రబాబుకు చెక్కులు అందించిన దాతలు - Donations For Flood Victims - DONATIONS FOR FLOOD VICTIMS

Donations to CM Relief Fund: వరద బాధితులకు సహాయం చేయాలన్న సీఎం చంద్రబాబు పిలుపు మేరకు సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున దాతలు విరాళాలు అందిస్తున్నారు. వరద బాధితుల సహాయార్థం ఎస్బీఐ ఉద్యోగులు రూ.5.87 కోట్ల విరాళం ప్రకటించారు. బ్యాంకు ఉద్యోగులతో అమరావతి సర్కిల్‌ జీఎం రాజేష్‌కుమార్‌ పటేల్‌ సంబంధిత చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. బాధితుల పక్షాన విరాళాలు ఇచ్చి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న వారికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

Donations to CM Relief Fund
Donations to CM Relief Fund (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 6, 2024, 9:10 AM IST

Donations to CM Relief Fund to Help Flood Victims :ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు విజయవాడ వరద బాధితుల సహాయం కోసం సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున దాతలు విరాళాలు అందిస్తున్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోటి రూపాయల విరాళం అందించారు. వరద బాధితుల సహాయార్థం ఎస్బీఐ ఉద్యోగులు రూ.5.87 కోట్ల విరాళం ప్రకటించారు. బ్యాంకు ఉద్యోగులతో అమరావతి సర్కిల్‌ జీఎం రాజేష్‌కుమార్‌ పటేల్‌ సంబంధిత చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.5 కోట్ల విరాళాన్ని అరబిందో ఫార్మా ప్రకటించింది. సీఎంఆర్​ఎఫ్​కు అరబిందో ఫార్మా ఫౌండేషన్‌ ద్వారా ఈ మొత్తం చెల్లిస్తామని అరబిందో ఫార్మా ఎండీ కె. నిత్యానందరెడ్డి తెలిపారు.

సీఎంకు భారీగా విరాళాలు అందించిన దాతలు : దేవీ ఫిషరీస్‌ లిమిటెడ్‌ సంస్థ రూ. కోటి విరాళం ఇచ్చింది. ఆ సంస్థ ఎండీ యార్లగడ్డ సూర్యరావు సంబంధిత చెక్కును సీఎంకు ఇచ్చారు. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు నిర్వహించే సంస్థ ఎన్‌సీసీ లిమిటెడ్‌ డైరెక్టర్‌ ఎస్‌ఆర్‌కే సూర్య శ్రీకృష్ణ, ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసి రూ. కోటి విరాళం చెక్కు అందజేశారు. క్యాపిటల్ హాస్పిటల్స్ యాజమాన్యం సీఎం సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళం చెక్కును ముఖ్యమంత్రికి అందజేసింది. కృష్ణా డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు రూ. 50 లక్షలు అందించారు.

వరద బాధితులకు చేయూత - ఏపీ సీఎం సహాయనిధికి భారత్ బయోటెక్​ రూ.కోటి విరాళం

చిగురుపాటి సాంబశివరావు 5 లక్షలు, పిన్నిటి ఉషారాణి రూ.5 లక్షలు, ఎంఎస్ఆర్ ఫుడ్స్ ఆక్వా ప్రైవేట్ లిమిటెడ్ శేషారావు 2 లక్షల రూపాయల విరాళాలు ఇచ్చారు. సత్తెనపల్లి నియోజకవర్గం గుడిపూడి గ్రామస్థులు రూ. లక్షన్నర, విజయవాడకు చెందిన పీవీ సత్యనారాయణ లక్ష రూపాయలు, జాగర్లమూడి చంద్రమౌళి కాలేజీ ఆఫ్ లా స్టూడెంట్స్ లక్ష రూపాయలు, ఝాన్సీ రాణి లక్ష, పిచ్చయ్య లక్ష రూపాయలు అందించారు. గుడిపూడి మిల్క్ ప్రొడ్యుసర్స్ వెల్ఫేర్ సొసైటీ రూ.50 వేలు ఇవ్వగా, డాక్టర్ మాధవీలత రూ.50 వేలు, ఆరెమండ రవిబాబు రూ.20 వేలు, కె.శివసుబ్బారావు 5 వేల రూపాయలు విరాళం ఇచ్చారు. బాధితుల పక్షాన విరాళాలు ఇచ్చి అండగా నిలిచేందుకు ముందుకొస్తున్న వారికి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

తెలుగు చిత్ర పరిశ్రమ కీలక నిర్ణయం - తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితులకు విరాళం - Telugu Film Industry Donation

వరద బాధితులకు అండగా టాలీవుడ్​ హీరోలు - తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం - Donations To Telugu States

ABOUT THE AUTHOR

...view details