Healthy Food in Summer Season :ఈ సారీ ఎండలు ఎక్కువగా ఉండడంతో ఇంటి నుంచి అడుగు తీసి బయటపెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రానున్న రోజుల్లో మండుటెండలు మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఉదయం 9 కాకుండానే సూర్యుడు భగభగమంటుండగా వడగాలులు పెరుగుతున్నాయి. ప్రజలు ఇంత వేడిని తట్టుకోవటం కష్టమే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వేసవి తాపంతో చల్లగా కూల్ డ్రింక్ తాగితే హాయిగా ఉంటుందని అనుకుంటే మాత్రం అనారోగ్యానికి గురికావడం తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Avoid Oil Food in Summer :మరోవైపు పిల్లలకు సెలవులు కావటంతో మిరపకాయ బజ్జీలు, సమోసాలు, పకోడీలు తింటే ఎంతో బాగుంటుందని మరికొందరు అనుకుంటారు. అలా బయటకు వెళ్లినప్పుడు బిర్యానీ లేనిదే రోజు పూర్తి కాదని అనే వారు మరికొంత మంది. కానీ ఈ కాలంలో వీటన్నింటికీ ఎంత దూరం ఉంటే అంత మంచిదని నిపుణుల సలహా. ఈ సీజన్‌లో నూనెలు ఎక్కువగా ఉండే వేపుళ్లు, స్నాక్స్, అధిక ప్రోటీన్ ఉండే మాంసాహారాలకు దూరంగా ఉంటేనే మంచిదని వైద్యులు చెబుతున్నారు. ఇవి త్వరగా జీర్ణం కాకపోవటంతో పాటు శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తాయని వివరిస్తున్నారు. ఇక కెఫిన్ ఎక్కువగా ఉండే టీ, కాఫీల వల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుందని తెలుపుతున్నారు.
సమ్మర్లో ఈ పదార్థాలు అస్సలు తినకండి - తీవ్ర అనారోగ్య సమస్యలు గ్యారెంటీ! - SUMMER AVOID FOODS
వేసవిలో ఇష్టంగా తినే ఐస్‌క్రీముల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ ఎక్కువగా పనిచేయాల్సి వచ్చి శరీరంలో మరింత వేడి పెరిగే ప్రమాదం ఉందంటున్నారు. అలాగే మద్యపానానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మద్యపానం వల్ల శరీరంలో నీటిశాతం పడిపోయి ఒక్కోసారి తీవ్ర అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు. వేసవిలో ఎక్కువగా దొరికే కర్బూజ, తాటి ముంజెల వంటి వాటిని తీసుకోవాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రత నుంచి శరీరాన్ని కాపాడుకోవటంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందంటూ వైద్యులు వెల్లడిస్తున్నారు. సీజనల్ ఫ్రూట్స్‌తో పాటు నీటిని ఎక్కువగా తీసుకోవటం మంచిదని వివరిస్తున్నారు. డీహైడ్రేషన్ బారిన పడకుండా చూసుకోవాలని చెబుతున్నారు.