20 Years Prison in Boy Rape Case :బాలుడిపై అత్యాచారం కేసులో ఒకరికి 20 ఏళ్లు జైలు శిక్ష పడగా బాలికపై బలాత్కారం ఘటనలో మరొకరికి పదేళ్ల శిక్ష పడిన ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేర్వురు న్యాయస్థానాల్లో జరిగింది. బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఈ నెల 23న జగిత్యాల న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2019 ఏప్రిల్ 4న మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామంలో గోగుల సాయికుమార్ అనే వ్యక్తి మామిడికాయలు తెచ్చుకుందామంటూ బాలుడిని నమ్మించి గ్రామ శివారులోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ ఘటనపై అప్పటి మల్లాపూర్ ఎస్సై డి.పుద్వీదర్ కేసు నమోదు చేయగా మెట్‌పల్లి సీఐ ఎం.రవికుమార్ దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణలో భాగంగా సాక్షులు, శాస్త్రీయ ఆధారాలు సేకరించి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడం జగిత్యాల జిల్లా న్యాయమూర్తి, ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జి.నీలిమ నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. ఈ నేపథ్యంలో నిందితుడికి శిక్ష పడడానికి చొరవ చూపిన అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.
ప్రేమిస్తున్నానని నమ్మించి :బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి పదేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ ఈ నెల 23న మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి డి. వెంకటేశ్ తీర్చిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం 2021 సెప్టెంబరు 20న కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన కుంచం రవి బాలికకు ఫోన్ చేసి ప్రేమిస్తున్నానని నమ్మించి, తనను కలిసేందుకు వరాహస్వామి దేవాలయం వద్దకు రావాలని కోరాడు. అతని మాటలు నమ్మిన బాలిక ఆలయం వద్దకు వెళ్లింది.