తెలంగాణ

telangana

ETV Bharat / state

కార్మికులకు వైకల్యం కలిగితే ఉచితంగా రూ.5 లక్షలు - ప్రభుత్వం అందించే ఈ సాయం మీకు తెలుసా?

కార్మికుల కుటుంబాలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది. అందులో భాగంగానే ప్రమాదంలో వైకల్యం ఏర్పడితే గరిష్ఠంగా రూ.5 లక్షల వరకు ఆర్థికసాయం అందిస్తోంది.

By ETV Bharat Telangana Team

Published : 5 hours ago

Disability Relief Scheme for Workers
Disability Relief Scheme (ETV Bharat)

Disability Relief Scheme for Workers :కార్మిక సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలు అమలు చేస్తోంది. ఆ స్కీమ్స్​ కింద పలు రకాల ప్రయోజనాలను కల్పిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే.. తెలంగాణ భవన, ఇతర కార్మిక సంక్షేమ మండలి, కార్మిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో "డిసేబిలిటీ రిలీఫ్​ స్కీమ్​ని" అమలు చేస్తున్నారు.

ఈ పథకం ద్వారా పని ప్రదేశంలో జరిగిన ప్రమాదం కారణంగా కార్మికుడికి శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం, అదే.. పాక్షిక వైకల్యానికి రూ.4 లక్షల వరకు రిలీఫ్ ఫండ్​ అందిస్తోంది తెలంగాణ ప్రభుత్వం(Telangana Government). మరి.. ఇందుకు కావాల్సిన అర్హతలు ఏంటి? ఏ ఏ పత్రాలు అవసరం? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అర్హతలు :

  • ఆర్థిక సాయం పొందాలనుకుంటున్న బాధిత కార్మికుడు తెలంగాణ భవన, ఇతర నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమ బోర్డులో సభ్యుడై ఉండాలి. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు జారీ చేసేగుర్తింపు కార్డు(Labour Card) కలిగి ఉండాలన్నమాట.
  • పనిచేస్తున్న ప్రదేశంలో ప్రమాదం కారణంగా వైకల్యం సంభవించి ఉండాలి.

దరఖాస్తు కోసం కావాల్సిన పత్రాలు :

  • దరఖాస్తుదారుడి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
  • ఆధార్ కార్డ్(Aadhaar)
  • బాధిత కార్మికుడి రిజిస్ట్రేషన్ కార్డ్(ఒరిజినల్)
  • రెన్యూవల్ చలాన్ కాపీ
  • డిసేబిలిటీ సర్టిఫికెట్(అధికారులు జారీ చేసినది)
  • FIR కాపీ (పోలీస్ కేసు నమోదైతే)
  • అడ్వాన్స్ స్టాంపెడ్ రశీదు
  • బ్యాంక్ పాస్‌బుక్ కాపీ

చాలామందికి తెలియదు - కార్మికుడు మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం!

దరఖాస్తు విధానం :

  • ప్రమాదంలో శాశ్వత లేదా పాక్షిక వైకల్యం పొందిన కార్మికుడు ఈ స్కీమ్ కింద లబ్ది పొందాలంటే ఆఫ్​లైన్​ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుదారులు ముందుగా డిసేబిలిటీ స్కీమ్​కి సంబంధించిన అప్లికేషన్​ ఫామ్​ని పొందాలి.
  • అందుకోసం సమీపంలోని కార్మిక శాఖ కార్యాలయాన్ని సంప్రదించి అప్లికేషన్ ఫామ్​ని పొందవచ్చు. లేదంటే.. కార్మిక శాఖ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లి కూడా ఇందుకు సంబంధించిన ఫామ్​ని డౌన్​లోడ్ చేసుకోవచ్చు.
  • డిసేబిలిటీ ఫామ్​ని పొందాక అందులో పేర్కొన్న వివరాలన్నీ కరెక్ట్​గా నమోదు చేయాలి. తర్వాత అవసరమైన పత్రాల కాపీలను అప్లికేషన్​ ఫామ్​కి జత చేయాలి.
  • అనంతరం ఫామ్​పై సంతకం చేసి కార్మిక శాఖలోని సంబంధిత అధికారికి అందజేయాలి.
  • అప్లికేషన్ ఇచ్చాక దరఖాస్తు చేసినట్టుగా మీరు అధికారి వద్ద నుంచి రిసిప్ట్ తీసుకోవాలి.
  • అలాగే రిసిప్ట్​పై సమర్పించిన తేదీ, సమయంతో పాటు మరికొన్ని ముఖ్యమైన వివరాలు సరిగ్గా ఉన్నాయా.. లేదా.. అని ఓసారి పరిశీలించుకోవాలి.
  • మీ దరఖాస్తు తర్వాత.. అసిస్టెంట్ కమిషనర్ స్థాయికి తగ్గని ప్రభుత్వ అధికారి దానిపై విచారణ జరుపుతారు.
  • అప్పుడు ప్రమాదవశాత్తుగానే శాశ్వత లేదా పాక్షిక వైకల్యం సంభవించినట్లు నిర్ధరణ జరిగితే.. నేరుగా బాధిత కార్మికుడి బ్యాంక్ అకౌంట్​లో ఆర్థిక సాయం జమ అవుతుంది!

ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.6 లక్షల సాయం - ఈ స్కీమ్ గురించి తెలుసా?

ABOUT THE AUTHOR

...view details