Digital Health Cards in Telangana : రాష్ట్రంలో ఆరోగ్య రంగంలో మార్పు దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. ప్రతి విషయంలో డిజిటల్ అవుతున్న తరుణంలో ఆరోగ్య విషయంలో ఇస్తున్న హెల్త్‌కార్డులను డిజిటలైజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా 18 సంతవత్సరాలపైన ఉన్న వారందరికీ డిజిటల్ హెల్త్ రికార్డులను అందజేయడంతో పాటు ప్రతి ఒక్కరికీ ఓ స్పెషల్ నంబర్‌ను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణియించింది. ఈ నేపథ్యంలో మార్గదర్శకాలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు.
రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ - త్వరలోనే డిజిటల్ హెల్త్ కార్డులు
Digital Health Cards Uses: డిజిటల్ హెల్త్‌కార్డుల మార్గదర్శకాలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. డిజిటల్ రికార్డులు(Digital Records) తయారు చేసేందుకు ప్రణాళికల్లో భాగంగా వివిధ అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రజల ఆరోగ్య స్థితిగతులపై పూర్తి సమాచారం అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు, అత్యవసర వైద్య సేవలను అందించేందుకు సులభంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలు, అందించాల్సిన వైద్యం, మెరుగుపరచాల్సిన వైద్య వసతులు, తీసుకోవాల్సిన విధానపరమైన నిర్ణయాలు, నిధుల కేటాయింపు, వైద్య ఆరోగ్యశాఖకు ప్రాధాన్యం తదితర అంశాలపై పూర్తి స్పష్టత వస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ఇతర రాష్ట్రాల్లోనూ ఉచిత వైద్యసేవలు
Eligibility of Digital Health Card: డిజిటల్ హెల్త్‌కార్డులను రూపొందించేందుకు అవసరమైన ప్రాథమిక అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. హెల్త్‌కార్డు ద్వారా సంబంధిత వ్యక్తి ఆరోగ్యం, అనారోగ్య పరిస్థితులు, గతంలో అందిన వైద్యం, చికిత్స, ఉపయోగిస్తున్న మందులు, సమస్య, డాక్టర్లఅభిప్రాయం, విశ్లేషణ వంటి అంశాలన్నీ డిజిటల్ రికార్డు రూపంలో అందుబాటులో ఉంటాయి. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా చికిత్సకు వెళ్లినా ఈ వివరాలన్నీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులకు వెంటనే తెలియడంతో మెరుగైన చికిత్స, వైద్య సేవలకు అవకాశం ఉంటుందని ఆలోచిస్తోంది. ఈ కార్డును ఆరోగ్య శ్రీ(Arogya Sri)తోనూ, ఆధార్‌తోనూ అనుసంధానం చేయనున్నారు.
డిజిటల్ హెల్త్ కార్డులో అంశాలు: క్షేత్రస్థాయిలో ఉన్న ఆరోగ్య సిబ్బంది ప్రతి ఇంటికీ వెళ్లి వ్యక్తిగత వివరాలను సేకరించి నమోదు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తుంది. పొడవు, ఎత్తు, బరువు తదితర అంశాలతో పాటు రక్త, మూత్ర పరీక్షల వివరాలు భద్రపరుస్తారు. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి నమోదు చేస్తారు. షుగర్, బీపీ వంటి జీవనశైలి వ్యాధులతో ఉన్నా గుర్తిస్తారు. ఇతర వైద్య పరీక్షలు అవసరమైతే వాటిని కూడా చేస్తారు. సమస్యలు ఉంటే నమోదు చేసి చికిత్స అందిస్తారు. ఇలా వ్యక్తిగత రికార్డులను రూపొందిస్తారు. అనంతరం వారికి అవసరమైన వైద్యసాయం అందిస్తారు.
బకాయిల సాకుతో ఆరోగ్య కార్డులు తిరస్కరిస్తున్న ఆస్పత్రులు
Digital Health Cards Use in GOVT Hospitals: ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సకు వెళ్లినా గుర్తింపు సంఖ్య(Healt Card Number) నమోదుతో వివరాలు వెంటనే అందుబాటులోకి వస్తాయి. ప్రజల వ్యక్తిగత వైద్యమే కాకుండా వివిధ రూపాల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు, సీజనల్ వ్యాధులు, ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటివాటిని గుర్తించేందుకూ అవకాశం ఉంటుందని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. హెల్త్‌కార్డుల డేటాను భద్రపరిచేందుకు రాష్ట్ర ఐటీ విభాగంతో సమన్వయంపై దృష్టి పెట్టనుంది.
National Handloom Day 2023 : నేతన్నలపై వరాల జల్లు.. ఆరోగ్యకార్డుతో పాటు ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేలు