Deputy Collectors and Tahsildars transfer :రాష్ట్రవ్యాప్తంగా ఐపీఎఎస్, డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్లను బదిలీలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మెుత్తం ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఇచ్చిన పోస్టింగ్ లు, బదిలీల్లో మార్పు చేర్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్ల బదిలీ చేసిన ప్రభుత్వం ఈసీ ఉత్తర్వుల ప్రకారం తక్షణమే ఆయా అధికారులు బదిలీ చేసిన చోట రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
పోస్టింగ్లు, బదిలీల్లో మార్పు చేర్పులు: ఐపీఎస్ అధికారుల బదిలీల్లో మార్పు చేర్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది మంది సీనియర్ ఐపీఎస్ అధికారులకు ఇచ్చిన పోస్టింగ్ లు, బదిలీల్లో మార్పు చేర్పులు చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. శాంతిభద్రతల అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీకి హోంగార్డ్ ఏడీజీగానూ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ రాజశేఖర్ బాబుకు కోస్టల్ సెక్యూరిటీ ఐజీగానూ అదనపు బాధ్యతలు అప్పగించారు. విజయవాడ పోలీసు కమిషనరేట్ లో శాంతిభద్రతల డీసీపీ గా కృష్ణకాంత్ ను నియమించారు. సీఐడీ ఎస్పీగా గంగాధర్ రావును నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. కాకినాడ ఎస్పీ సతీష్ కుమార్ కు కాకినాడ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంటుగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మంగళగిరి 6వ బెటాలియన్ కమాండెంట్ గా వి. రత్న, అనంతపురం 14వ బెటాలియన్ కమాండెంటుగా అమిత్ బర్దార్ ను నియమించారు. ఇంటెలిజెన్స్ విభాగానికి ఆనంద రెడ్డి బదిలీ చేస్తూ ఈ మార్పులు చేశారు.