ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రీన్‌కో సోలార్‌పవర్‌ కంపెనీ వల్ల లక్షల మందికి ఉపాధి : పవన్‌ కల్యాణ్‌ - PAWAN VISIT GREENCO POWER PROJECT

కర్నూలు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన - పిన్నాపురంలో గ్రీన్‌కో సోలార్‌పవర్‌ ప్రాజెక్టును పరిశీలన

Pawan_visit_Greenco_Power_Project
Pawan_visit_Greenco_Power_Project (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 11, 2025, 5:32 PM IST

Updated : Jan 11, 2025, 6:43 PM IST

Pawan Kalyan visit Pinnapuram Greenco Solar Power Project: పిన్నాపురంలోని గ్రీన్‌కో ప్రాజెక్టు వల్ల రాష్ట్రంతోపాటు దేశానికే మంచిపేరు వస్తుందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరోచోట లేదని అన్నారు. కర్నూలు జిల్లా పిన్నాపురంలో పవన్ విసృతంగా పర్యటించారు. హెలికాప్టర్‌ ద్వారా గ్రీన్‌కో సోలార్‌పవర్‌ ప్రాజెక్టును పరిశీలించారు.

పిన్నాపురం వద్ద ప్రపంచంలోనే అతిపెద్దదైన గ్రీన్‌కో సోలార్ పవర్‌ ప్రాజెక్టు అని తెలిపారు. గ్రీన్‌కో దేశంలో రూ.లక్షన్నర కోట్లు పెట్టుబడి పెడుతోందని అందులో మన రాష్ట్రంలో రూ.35 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్నారని వెల్లడించారు. గ్రీన్‌కో సోలార్‌పవర్‌ కంపెనీ వల్ల లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. మొత్తం 2,800 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారని పవన్‌ కల్యాణ్‌ వివరించారు.

ఇలాంటి సమీకృత ప్రాజెక్టు దేశంలో మరోచోట లేదని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ఈ భూమిపై రెవెన్యూ, అటవీశాఖ మధ్య చిన్న వివాదం వచ్చిందని ఆ వివాదాన్ని పరిష్కరించాలని కేంద్రానికి విన్నవించామని తెలిపారు. ఇంత భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారంటే చాలా ఆనందంగా ఉందని అన్నారు. గ్రీన్‌కో కంపెనీకి అంతర్జాతీయంగా మంచి పేరుందని తెలిపారు. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు పర్యాటక కేంద్రం కానుందని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టుకు తగిన సహకారం అందించాలని కోరారు.

చంద్రబాబు ఇష్టాగోష్టి- గ్రీన్‌ ఎనర్జీ రూపంలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు

గ్రీన్​కో కంపెనీ పిన్నాపురంలో ఇప్పటికే రూ.12 వేల కోట్లు పెట్టుబడి పెట్టిందిని అలానే మరో రూ.10 వేల కోట్లు పెట్టుబడి పెట్టనుందని పవన్‌ కల్యాణ్‌ వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల జిల్లాకు, రాష్ట్రానికే కాదు దేశానికీ మంచిపేరు వస్తుందని కొనియాడారు. సీఎస్‌ఆర్‌ నిధుల ద్వారా పలు కార్యక్రమాలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. పాఠశాలలు, సేంద్రియసాగు, గోవుల సంతతి పెంచేలా చూడాలని పవన్‌ పిలుపునిచ్చారు. 50 వేల మందికి ఉపాధి కల్పిస్తున్న గ్రీన్‌కో కంపెనీకి పవన్ కల్యాణ్ ధన్యవాదాల తెలిపారు. కేంద్రం అనుమతితో 365 హెక్టార్ల అటవీ భూమిని సంస్థ కొనుగోలు చేసిందని అందుకు నెల్లూరులో రూ.36 కోట్ల విలువైన భూమిని సంస్థ ప్రభుత్వానికి ఇచ్చిందని తెలిపారు. ఫారెస్టు, రెవెన్యూ మధ్య 45 హెక్టార్ల భూమి వివాదంలో ఉందని అన్నారు.

అటవీ భూములను తిరిగి స్వాధీనం: అటవీ భూముల అన్యాక్రాంతంపై త్వరలోనే స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించే యోచన చేస్తున్నట్లు పవన్‌క ల్యాణ్ తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు అటవీ భూములను ఆక్రమించుకున్నారనే వార్తలపై ఆయన స్పందించారు. త్వరలోనే కడప, అన్నమయ్య జిల్లాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి ఆక్రమణకు గురైన అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.

గ్రీన్‌కో సోలార్‌పవర్‌ కంపెనీ వల్ల లక్షల మందికి ఉపాధి అవకాశాలు: పవన్‌ కల్యాణ్‌ (ETV Bharat)

మూడు భాషల్లో ఇష్టమైన పుస్తకాలు కొన్న పవన్ - 2 గంటలపాటు స్టాళ్లు ఓపెన్

జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ - కిటకిటలాడుతున్న టోల్‌గేట్లు

Last Updated : Jan 11, 2025, 6:43 PM IST

ABOUT THE AUTHOR

...view details