తెలంగాణ

telangana

మట్టికుండా మజాకా - వేసవిలో సమ్మర్​ పాట్స్​కు సూపర్ క్రేజ్ - Clay Pots Demand in Market

By ETV Bharat Telangana Team

Published : Apr 14, 2024, 6:41 AM IST

Demand for Clay Pots in Market : వేసవి రాకతో ఎండల తాకిడికి ఎక్కువ మంది ప్రజలు చల్లటి నీటిని తాగడానికి కుండల వైపే మొగ్గు చూపుతారు. ఒకప్పుడు స్తోమత ఉన్నవారు రిఫ్రిజిరేటర్​లను కొనుగోలు చేస్తే, పేదవారు మాత్రం సంప్రదాయ పద్ధతిలో నీటిని చల్లబరిచే కుండల్ని ఖరీదు చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారింది. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరూ మట్టికుండలే కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారస్తులు ప్రజల అవసరాలు, అభిరుచికి తగ్గట్టుగా భిన్నంగా మట్టి కుండలు మార్కెట్లో విక్రయిస్తున్నారు.

Pot Water Health Benefits
Huge Demand For Clay Pots in Hyderabad

ఎండ తాకిడితో మట్టికుండలపై నగరవాసుల్లో పెరుగుతున్న ఆదరణ

Demand for Clay Pots in Market :రిఫ్రిజిరేటర్లు, నీటిని చల్లబరిచే వాటర్ కూలర్లు మార్కెట్లో ఎన్ని వచ్చినప్పటికీ, పేదవాడి ఐస్ బాక్స్​గా పేరుగాంచిన మట్టికుండలకు ఆదరణ తగ్గలేదు. ఒకప్పుడు పల్లెలకు మాత్రమే పరిమితమైన మట్టికుండలు నేడు వేసవి దాహార్తిని తీర్చడానికి నగరాల్లోనూ విరివిగా విక్రయిస్తున్నారు. పేదవారు మాత్రమే కాదు సంప్రదాయ పద్ధతిని(Traditional Method) ఇష్టపడేవాళ్లు మట్టి కుండలో నీటిని నిల్వచేసి తాగుతున్నారు.

ఒకప్పుడు గుండ్రటి ఆకారంలో మాత్రమే ఉండే కుండ, తర్వాత కాలంలో వీటిని కాస్త ఆధునీకరించి నీళ్లు తాగేందుకు వీలుగా వాటికి నల్లాలు(Water Taps) బిగిస్తున్నారు. తాగేందుకు మట్టికుండలే కాక, వెంట తీసుకెళ్లేందుకు మట్టితో చేసిన వాటర్ బాటిళ్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే వాళ్లు తగ్గిన, వినియోగదారుల అభిరుచి మేరకు కొనుగోలు చేసి అమ్ముతామని వ్యాపారులు అంటున్నారు.

Clay Pot Water Health Benefits : మట్టి కుండలోని నీళ్లు తాగితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

"వేసవికాలం, వినాయక చవితి, దీపావళి సీజన్​లో మా వ్యాపారం కాస్త మెండుగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే సమ్మర్​లో మట్టికుండలు బాగా అమ్ముడై, లాభం చేకూరుతుంది. కొందరు వాటిని జాడీలని అంటారు, మేము బిందెలు అని అంటాము. మా దగ్గర మట్టి ఇంత స్మూత్​గా రాదు. వీటిలో కొన్ని పలుచోట్ల నుంచి ఇక్కడకు తెచ్చి అమ్ముకుంటాం. బీపీ, షుగర్​ ఉన్న వాళ్ల ఈ కుండల్లో వంట చేసుకొని తింటే, వారి ఆరోగ్యం కొంచెం నియంత్రణలోకి వస్తాది." - మట్టి కుండల వ్యాపారులు

Pot Water Health Benefits :సంప్రదాయ పద్ధతుల్ని ఇష్టపడేవారు రిఫ్రిజిరేటర్​లో కంటే కుండలో నీటిని తాగడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఫ్రిజ్​లో అతి చల్లదనం వల్ల పళ్లకు హాని కలిగే అవకాశం ఉంటుంది. కుండలో మనం తాగగలిగేంత చల్లదనం(Cooling Water) మాత్రమే ఉంటుంది. అందుకే తాగునీటి అవసరాల కోసం మట్టి కుండలని కొనుగోలు చేస్తున్నారు. మట్టి పాత్రలలో వంట చేసుకోవటం, నీళ్లు తాగటం వల్ల సకల రోగాలను నయం చేసుకునే అవకాశం ఉంటుందని వినియోగదారులు అంటున్నారు.

"సమ్మర్​లో ఫ్రిజ్ వాటర్​ చాలా ఎక్కువగా తాగుతుంటాం. దానివల్ల జలుబు, గొంతుకు సంబంధించి వ్యాధులు రావటం జరుగుతుంటాయి. అదే ఈ ఎర్ర మట్టితో చేసిన కుండల్లో అయితే సహజంగా నీరు చల్లబడి ఎంతో ఆరోగ్యంతో ఉండొచ్చు. మేమైతే పెద్ద జాడీలు కొనుగోలు చేస్తూ ఉంటాం, అవి అయితే మూడు, నాలుగు సంవత్సరాలు మన్నిక వచ్చేవి. ఇప్పుడు చిన్న కుండలు కావటంతో ఏటా కొనుగోలు చేస్తుంటాం." -వినియోగదారులు

ఆగిన కుమ్మరి చక్రం.. ఆకలితో నిత్యం పోరాటం

ప్లాస్టిక్ కవర్లకు బదులుగా పర్యావరణహిత మొక్కల తొట్టి, పదో తరగతి కాకముందే పారిశ్రామికవేత్త

ABOUT THE AUTHOR

...view details