Deepadas Munshi Legal Notice to NVSS Prabhakar : బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ లీగల్ నోటీసులు(Legal Notice) పంపారు. ఇటీవల ఓ ఛానెల్ డిబేట్లో పాల్గొన్న ప్రభాకర్ ఆమెపై ఆరోపణలు చేశారు. దీపాదాస్ మున్షీ కాంగ్రెస్ నాయకుల నుంచి బెంజ్ కారును తీసుకున్నారని డిబేట్లో పేర్కొన్నారు. ఆ ఆరోపణలపై బీజేపీ నేతకు లీగల్ నోటీసులు పంపారు.
"కొందరు కాంగ్రెస్ నాయకులకు లబ్ధి చేకూర్చేందుకు గానూ బెంజ్ కారును కానుకగా పొందినట్లు ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇది దీపాదాస్ మున్షీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉంది" అని నోటీసులో పేర్కొన్నారు. దీపాదాస్ మున్షీ(Deepa Das Munshi)కి కారును కానుకగా ఇచ్చిన వారి పేర్లు కూడా తెలుసునని డిబేట్లో పేర్కొన్న ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, వారెవరో రెండు రోజుల్లో చెప్పాలని నోటీసులో స్పష్టం చేశారు.
రెండు రోజుల్లోపు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను నిరూపించలేకపోతే నోటీసు అందిన ఏడు రోజుల్లోపు బహిరంగ క్షమాపణ చెప్పడంతో పాటు రూ.10 కోట్ల పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని నోటీసులో పేర్కొన్నారు. లేని పక్షంలో ప్రభాకర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని దీపాదాస్ మున్షీ తరఫు లాయర్ నోటీసుల్లో స్పష్టం చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్‌పై కోపంతో కాంగ్రెస్‌ను గెలిపించారు - ఎంపీ ఓటు మాత్రం బీజేపీకే అంటున్నారు : ఈటల రాజేందర్
ప్రభాకర్ క్షమాపణ చెప్పాలి లేకుంటే తీవ్ర పరిణామాలు :ఇదిలా ఉండగాఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. తమ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీపై అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాటలు దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠని ధ్వజమెత్తారు. బీజేపీ(BJP) నాయకులు నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనలో ఆయన ఇలాంటి నిరాధార సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. మరోవైపు ప్రభాకర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు.
తెలంగాణ ఎన్నికల ఫలితాలు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని అధిరోహించిన తర్వాత అప్పటివరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీగా ఉన్న మాణిక్‌రావు ఠాక్రేను బదిలీపై ఆంధ్రప్రదేశ్‌కు పంపించారు. ఆ తర్వాత ఠాక్రే స్థానంలో దీపాదాస్ మున్షీని ఇంఛార్జీగా ఏఐసీసీ నియమించింది. నియమించి రెండు నెలలు కాకముందే ఆమెపై బీజేపీ నేతలు పదవుల కోసం బెంజ్ కారు తీసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు, దీపాదాస్ మున్షీ ఖండిస్తూ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు లీగల్ నోటీసులు పంపించారు.
కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారిన ఇంఛార్జ్‌లు - ముడుపులు తీసుకొని పదవులు ఇస్తున్నారనే ఆరోపణ
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయండి - రాష్ట్ర నాయకత్వానికి అధిష్ఠానం ఆదేశాలు