తెలంగాణ

telangana

ETV Bharat / state

వివేకా హత్య కేసులో దస్తగిరి సంచలన వ్యాఖ్యలు - 'భారతి సూచన లేనిదే ఈ సాహసం చేయలేరు' - Dastagiri on YS Viveka Murder Case - DASTAGIRI ON YS VIVEKA MURDER CASE

Dastagiri About YS Viveka Murder Case : వివేకా హత్య కేసు వెనుక ఎవరు ఉన్నారో, చంపించింది ఎవరో ప్రజలందరికీ తెలుసని వివేకా కేసు అప్రూవర్​ దస్తగిరి అన్నారు. జగన్​, అతని భార్య భారతి హస్తం ఉందనే కేసు విచారణ ముందుకు వెళ్లటం లేదని ఆరోపించారు. భారతి సూచన లేనిదే జగన్​ ఈ సాహసం చేసే అవకాశం లేదని దస్తగిరి వెల్లడించారు.

Dastagiri About Viveka Murder Case
Dastagiri About Viveka Murder Case

By ETV Bharat Telangana Team

Published : Apr 24, 2024, 10:37 AM IST

Updated : Apr 24, 2024, 11:05 AM IST

వైఎస్ వివేకా హత్య కేసులో సంచలన విషయాలు వెల్లడించిన దస్తగిరి

Dastagiri Sensational Comments Viveka Murder Case : ఏపీ మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి మరిన్ని కీలక విషయాలు బయటపెట్టారు. ఈ హత్యలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డితోపాటు సీఎం జగన్‌, ఆయన భార్య భారతి హస్తం ఉందని అందుకే కేసు విచారణ ముందుకు సాగడం లేదని ఆరోపించారు. ఈ విషయం వైఎస్సార్‌ జిల్లా ప్రజలందరికీ తెలుసన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు దస్తగిరి వెల్లడించారు.

YS Viveka Murder Case Updates : వివేకా హత్యకు ముందు తనను భాస్కర్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లగా అక్కడ అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఉన్నారని దస్తగిరి తెలిపారు. వాళ్లు చెప్పినట్లు చేయాలని కోరడంతో తాను వెనక్కి తగ్గానని చెప్పారు. దీంతో వెంటనే అవినాష్‌రెడ్డి ఫోన్‌ ద్వారా జగన్‌ తనతో మాట్లాడారని పేర్కొన్నారు. 'దస్తగిరీ మావాళ్లు ఏం చెబితే అది చేయ్​, ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా' అని జగన్​ చెప్పడంతో ధైర్యంగా రంగంలోకి దిగానని వివరించారు. భారతి సూచన లేనిదే ఆయన ఈ సాహసానికి పాల్పడే అవకాశం లేదని దస్తగిరి వెల్లడించారు.

జగన్‌ అండతోనే ఇవన్నీ జరిగాయి:వివేకా హత్య వెనుక జగన్‌, భార్య భారతి హస్తం ఉన్నందునే సాక్ష్యాలను చెరిపే ప్రయత్నం చేశారని దస్తగిరి ఆరోపించారు. కడపలో సీబీఐ ఎస్పీ రాంసింగ్‌పైనే కేసు పెట్టారని చెప్పారు. సీబీఐ వాహన డ్రైవర్‌పై బెదిరింపులకు దిగారని అన్నారు. జగన్‌ అండ లేకపోతే వివేకా ఇంట్లో కుక్క కూడా చనిపోదని తెలిపారు. తనకున్న గుండె ధైర్యంతోనే ఎర్ర గంగిరెడ్డి హత్యకు తనను ఎంచుకున్నారని తెలిపారు. అప్రూవర్‌గా మారే ముందు తన నిర్ణయాన్ని ఎర్ర గంగిరెడ్డికి స్పష్టంగా చెప్పినట్లు విరించారు. అప్రూవర్‌గా మారినట్లైతే తనతో పాటు జగన్‌ దంపతులు కూడా జైలుకు పోయే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారని పేర్కొన్నారు. కానీ అప్రూవర్‌గా మారకపోయి ఉంటే టీడీపీపై కేసును నెట్టేసేవారని దస్తగిరి వ్యాఖ్యానించారు.

నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత: దస్తగిరి

'నేను తప్పు చేశాను కాబట్టే పశ్చాత్తాపంతో అప్రూవర్‌గా మారాను. ఎన్ని కోట్ల డబ్బులిచ్చినా తలొగ్గను మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే లక్షల హత్యలు జరుగుతాయి. అందుకే ప్రజలు ఆలోచించి ఓటేయాలి. చంద్రబాబు, సునీత, షర్మిల, దస్తగిరి కలిసి తనపై పోరాటానికి దిగారని, హంతకుడు దర్జాగా తిరుగుతున్నాడని జగన్‌ ప్రొద్దుటూరు సభలో మాట్లాడారు. అది విడ్డూరం నా ఫోన్‌ ట్యాపింగ్‌లో ఉంది. నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చు. నాలో నీతి, నిజాయతీ ఉన్నందునే పారిపోకుండా సీఎం ఇంటి పక్కనే బతుకుతున్నా' అని దస్తగిరి అన్నారు.

నా ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే సీఎం జగన్‌దే బాధ్యత: దస్తగిరి

ఐదేళ్ల నుంచి ఏం మాట్లాడక ఉండి ఇప్పుడు వివేకా హత్య గురించి మాట్లాడుతున్నారు. ఎవరు హత్య చేశారో ప్రజలందరికీ తెలుసు. మీరా లేక నేనా హంతకులు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. సునీతతో నాకు ఒప్పందం ఉన్నట్లు అవినాష్‌రెడ్డి నిరూపిస్తే నేను జైలుకు వెళ్లేందుకు సిద్ధం. నిరూపించలేకపోతే అవినాష్‌రెడ్డి సిద్ధమా? నేను సవాలు విసురుతున్నాను. కడప జైల్లో నన్ను వైసీపీ నేతలు బెదిరించారు. -దస్తగిరి, వివేకా హత్య కేసులో అప్రూవర్​

పులివెందులలో జై భీమ్‌ భారత్‌ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి తాను ప్రయత్నిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారని దస్తగిరి వాపోయారు. ఈ నెల 25న నామినేషన్‌కు సిద్ధమవుతుండగా, అదేరోజు జగన్‌ నామినేషన్‌ వేస్తారని పోలీసులు ఆంక్షలు పెట్టారని చెప్పారు. ముఖ్యమంత్రి నామినేషన్‌ వేసే రోజు ఇతరులు వేయరాదనే నిబంధన ఉందా అని ప్రశ్నించారు. సీఎం ఇంటికి దగ్గర్లోనే తన ఇల్లు ఉందని, అక్కడ జైభీమ్‌ పార్టీ పోస్టర్లు, బ్యానర్లు పెడితే తీసేయాలని పోలీసులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీ అధినేత జడ శ్రావణ్‌కుమార్‌ ఆదుకున్నట్లు దస్తగిరి గుర్తు చేశారు.

భద్రత పెంపు :మరోవైపు దస్తగిరికి పోలీసులు భద్రత పెంచారు. గురువారం అతని నామినేషన్ సందర్భంగా ఇవాళ, గురువారం భద్రత పెంచినట్లు పోలీసులు తెలిపారు. గురువారం సీఎం జగన్ కూడా పులివెందులలో నామినేషన్ వేయనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా దస్తగిరికి త్రీ ప్లస్ త్రీ, ఫోర్ ప్లస్ ఫోర్ నుంచి ఫోర్ ప్లస్ ఫోర్, టెన్‌ ప్లస్‌ టెన్‌ భద్రత కల్పించామని పోలీసులు వివరించారు.

సాక్ష్యాన్ని ఉపసంహరించుకుంటే రూ.20 కోట్లు ఇస్తామన్నారు : దస్తగిరి

వైఎస్ వివేకా హత్య కేసులో నిజాలేంటో ఇకముందు తెలుస్తాయి: దస్తగిరి

Last Updated : Apr 24, 2024, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details