Dalit Groups Strike Across the State : ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాల సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. మాల సంఘాల ఆందోళనలతో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. విజయవాడలో పాక్షికంగా సిటీ బస్సులు నడిపారు. తెల్లవారుజాము నుంచి నెహ్రూ బస్టాండ్‌లో బస్సులను అధికారులు నిలిపివేశారు. తెనాలి, గుంటూరు, రేపల్లె తదితర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో వాహన రాకపోకలను ఎస్సీ నాయకుల అడ్డుకున్నారు. కళాశాలలకు వెళుతున్న బస్సులను రోడ్డుపైన ఆపేశారు.
మోదీ దిష్టిబొమ్మను దగ్ధం : ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సుప్రీంకోర్టు పునారాలోచన చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో మాల సంఘాల నేతలు రోడ్డుపై ఆందోళన చేశారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు బంద్‌లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా అమలాపురం జాతీయ రహదారిపై ఎస్సీ నాయకులు వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. విద్యాసంస్థలు మూసివేయాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు - రిజర్వేషన్ల విధానంపై ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? - Supreme Court
తీవ్ర ఇబ్బందులు పడ్డ విద్యార్థులు, ఉద్యోగులు : వైఎస్సార్ జిల్లా మైదుకూరులో మాల మహానాడు నేతలు నిరసన తెలిపారు. నాలుగురోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా మునగపాక, చోడవరం ప్రాంతాల్లో ఆందోళనకారులు బస్సులు అడ్డుకుని ఆందోళన తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఆర్టీసీ బస్టాండ్ వద్ద దళిత నేతలు ఆందోళన చేశారు. డిపో వద్ద బస్సులను అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
వర్గీకరణ వద్దు రాజ్యాంగం ముద్దు : ఎస్సీ వర్గీకరణను నిరసిస్తూ కోనసీమ జిల్లా అంబాజీపేటలో మాల మహానాడు ఆధ్వర్యంలో ఆ సామాజిక వర్గీయులు ఆందోళన చేపట్టారు. మండలంలోని దుకాణ సముదాయాలను ముసివేయించారు. అలాగే పాఠశాలలు సైతం తెరచుకోలేదు. అదేవిధంగా దళిత యువత ఆధ్వర్యంలో పురవీధులలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అమలాపురం, రాజోలు, రావులపాలెం డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. ఈ సందర్బంగా "వర్గీకరణ వద్దు రాజ్యాంగం ముద్దు" అంటూ నినాదాలు చేశారు.
'ఆర్థికంగా, సామాజికంగా ఎస్సీల జీవితాల్లో వెలుగులు రావాలి'- సుప్రీం తీర్పుపై సీఎం, మంత్రుల స్పందన - AP CM On SC ST
'రాజ్యాంగం అంగీకరించదు' - ఎస్సీ వర్గీకరణపై గతంలో జగన్ వ్యాఖ్యలు - సోషల్ మీడియాలో వీడియో వైరల్ - Jagan on SC