తెలంగాణ

telangana

ETV Bharat / state

రూ.17 లక్షలు ఇస్తే ప్రతి నెలా 30 వేలు, బోనస్​గా 267 గజాల ప్లాట్! - INVESTMENT CHEATING IN HYD

పెట్టుబడి పేరుతో భారీ మోసం - బాధితుల నుంచి రూ.24 కోట్లు వసూళ్లు - నలుగురు నిందితులను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

INVESTMENT FRAUD IN HYD
Four Arrest due Investment Fraud in Hyderabad (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 24, 2024, 10:25 PM IST

Updated : Oct 25, 2024, 6:16 AM IST

Four Arrest due Investment Fraud in Hyderabad : త్వరగా పెట్టుబడిపై లాభాలు వస్తాయని చెబితే చాలు జనాలకు ఎలా వస్తాయనే ఆలోచనే రాదు. సాధ్యమా కాదా, అలా జరుగుతుందా, ఆ వ్యక్తిని నమ్మొచ్చా అనేది ఏది పట్టించుకోం. అరచేతిలో స్వర్గం చూపించే వాడికి పెద్ద పీట వేస్తాం. వాడు ఏం చెబితే దానికి తలూపేస్తాం. ఈజీ మనీ కోసమో, త్వరగా సంపాదించాలనే ఆశతో వాళ్ల ట్రాప్​లో పడతాం. త్వరగా లాభాలు వస్తే చాలు అనే మనిషి ఆశే లోకంలో చాలా మంది మోసగాళ్లకు వరం. ఇలా ఆశ చూపించే సైబరాబాద్ పరిధిలో ఓ ముఠా 24 కోట్లు వసూలు చేసి దుకాణం సర్దేసింది.

మాయమాటలతో జనాలను మోసం చేసి రూ.24 కోట్లు కాజేసిన నలుగురు నిందితుల గ్యాంగ్​ను సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు (Economic Offences Wing) అరెస్ట్ చేశారు. వీరి బై బ్యాక్ స్కీమ్ ప్రకారం మెంబర్​గా జాయిన్ అయిన వ్యక్తి రూ.17 లక్షలు కట్టాలి. అలా కట్టిన వ్యక్తికి వంద నెలల పాటు నెలకు రూ.30 వేల చొప్పున చెల్లిస్తారు. అంతేకాకుండా మహబూబ్​నగర్​లోని తిరుమలగిరి గ్రామంలో 267 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తామని నమ్మించారు. అదనంగా ఒక వేళ ఆ భూమిలో గంధపు చెట్లు నాటించుకుంటే 13 నుంచి 15 ఏళ్లకు వాటిలోనూ 50 శాతం వాటా ఇస్తామని ఆశ పుట్టించారు.

ఇదంతా నమ్మి సుమారు 120 మంది బాధితులు డబ్బులు కట్టారు. బాధితుల నుంచి రూ.24 కోట్ల రూపాయలు తీసుకున్న తొలుత కొన్ని నెలల పాటు నెలకు రూ.30వేల చొప్పున ఇచ్చారు. అనంతరం స్పందించకపోవడంతో కేపీహెచ్​బీలో నివాసముండే బాధితుడు నాగరాజు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు స్క్వేర్ అండ్ యార్డ్స్ ప్రైవేట్​ లిమిటెడ్​ డైరెక్టర్లు బైరా చంద్రశేఖర్, వేములపల్లి జాహ్నవి, వెంకట అఖిల్​లతో పాటు యాడ్ ఎవెన్యూ డైరెక్టర్ రెడ్డిపల్లి కృష్ణ చైతన్యలను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు.

అధిక వడ్డీ ఆశ చూపి రూ. 20 కోట్ల మోసం - బాధితులంతా బంధువులే - 20 Crore Rupees Investment Fraud

రూ.10వేలకు 20 వేలు వస్తాయన్నారు - చివరకు రూ.10కోట్లు కొట్టేశారు - Investment Fraud in Karimnagar

Last Updated : Oct 25, 2024, 6:16 AM IST

ABOUT THE AUTHOR

...view details