తెలంగాణ

telangana

ప్రజల నమ్మకమే సైబర్​ మోసగాళ్లకు పెట్టుబడి - చైనా పరిజ్ఞానంతో జేబులు ఖాళీ

By ETV Bharat Telangana Team

Published : Feb 5, 2024, 8:37 PM IST

Cyber Financial Fraud In Telangana : ప్రజల నమ్మకమే సైబర్ మోసగాళ్లకు పెట్టుబడిగా మారింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆదాయవనరుగా మలుచుకొని ప్రజల జేబులు ఖాళీ చేస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ రాబడంటూ, ఇళ్లు కదలకుండా రోజువారీ సంపాదన వస్తుందని ఆశ చూపుతూ నిండా ముంచుతున్నారు. ఇలా సైబర్ కేటుగాళ్లు తెలంగాణలోనే కోట్ల రూపాయలను దోచుకుంటున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెల్ప్ లైన్​కు రోజుకు 30కిపైగా ఫిర్యాదులు వస్తున్నాయంటే రోజు ఎన్ని కోట్లు నష్టపోతున్నామో అర్థం చేసుకోవచ్చు.

Cyber Financial Fraud In Telangana
Cyber Financial Fraud In Telangana

Cyber Financial FraudIn Telangana: ఇన్వెస్ట్​మెంట్​ జాబ్ ఫ్రాడ్​ పేరుతో మోసాలకు పాల్పడుతున్న సైబర్ కేటుగాళ్లు చైనాకు చెందిన నకిలీ కంపెనీలు ఏర్పాటు చేసుకుని బయటి ప్రపంచానికి తెలియకుండా మధ్యతరగతి ప్రజల నుంచి వేల కోట్ల కష్టార్జితం కాజేస్తున్నారు. దళారులు, కమీషన్ గాలంతో సామాన్యులను ఏజెంట్లుగా మలుచుకుంటున్నారు. నకిలీ సంస్ధలు, క్రిప్టో, బిట్ కాయిన్ ఖాతాలు తెరిపించి పావులుగా తయారు చేసుకుంటున్నారు. కేవలం డబ్బుపై ఆశతో లొంగిపోయినందుకు పోలీసు కేసులో ఇరుక్కొని జైలులో ఊచలు లెక్కిస్తున్నారు.

Cyber crime news : లాభాల పేరిట వల.. రెండు నెలల్లో రూ.300 కోట్ల మోసం

Cyber Crime In Hyderabad :సైబర్ మోసగాళ్లురూటుమార్చి ఏమార్చి రుణయాప్‌లతో అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా అడగ్గానే అప్పులిచ్చే వేదికలు అమాయక యువత డైరక్టర్లుగా నకిలీ సంస్థలను ఏర్పాటు చేశారు. వీరి ద్వారానే మధ్యతరగతి యువత, నిరుద్యోగులు, గృహిణులకు అప్పులు ఇప్పించారు. 100 శాతం వడ్డీలు వసూలు చేసి ఎంతోమంది ఆత్మహత్యకు కారకులయ్యారు. దీనిపై ప్రభుత్వం సీరియస్​గా వ్యవహరించటంతో వాటికి అడ్డుకట్ట పడింది. ఇప్పుడు వాటి స్థానంలో ఉద్యోగ ఉపాధి, ఆన్​లైన్​ గేమింగ్ మోసాల యాప్​లతో(Online Gaming Apps) మోసాలకు పాల్పడుతున్నారు. దుబాయ్, చైనా, తైవాన్, మలేషియా, సింగపూర్ తదితర దేశాల నుంచి ప్రధాన నిర్వాహకులు ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నారు.

Cyber Crime 2024 :భారత్ నుంచి విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులను అక్కడి విమానాశ్రయాల్లో ఫైనా గైడ్స్ ట్రాప్ చేస్తున్నారు. తమ సంస్థలు భారత్​లో వ్యాపార కార్యకలాపాలు చేపట్టబోతున్నాయని, అవసరమైన మానవ వనరులను ఎంపిక చేసుకుంటున్నామంటూ నమ్మిస్తున్నారు. వారి వ్యక్తిగత వివరాలు సేకరించి ఆసక్తి గల వారిని అవకాశంగా మలచుకుంటున్నారు. సొంత ఖర్చులతో విదేశాలకు తీసుకు వెళ్తున్నారు. ఖరీదైన హోటళ్లలో బస ఏర్పాటు చేసి, ఒకట్రెండు రోజులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వారికి ఇష్టానికి అనుగుణంగా బ్యాంకు ఖాతాలు సమకూర్చటం, క్రిప్టో వీడి కాయిన్స్ ఖాతాల రూపొందించటం, నకిలీ సంసల ఏర్పాటు తదితర బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా రూ.50,000 నుంచి లక్ష వరకు కమీషన్​గా ఇస్తున్నారు.

cyber crime news: క్రెడిట్​ కార్డ్​ రివార్డ్​ పాయింట్స్​ పేరిట లింక్.. ఓపెన్​ చేస్తే...

సైబర్​ క్రైం : దళారులకు ఒక్క బ్యాంకు ఖాతా సమకూర్చేందుకు రూ.50వేలు ఇస్తున్నారు. వాటిలో రూ.20వేలతో ఖాతా తెరిపించి, 30వేలు కాజేస్తున్నారు. ఇలా గోవా, ముంబయికి చెందిన ఇద్దరు దళారులు దాదాపు 500 బ్యాంకు ఖాతాలు తెరిపించి చైనా కేటుగాళ్ల చేతికి అప్పగించారని వివిధ కేసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. బాధితుల నుంచి మాయగాళ్ల ఖాతాల్లోకి చేరిన నగదును వెంటనే వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లిస్తారు. కొన్నిసార్లు వాలెట్, డిజిటల్ ఖాతాల్లో జమచేస్తారు. అక్కడ నుంచి హవాలా ముఠాల చేతుల్లోకి డబ్బు చేరుతుంది. అక్కడి నుంచి బిట్​కాయిన్ ఖాతా ఉన్న వారి బ్యాంక్ ఖాతాలోకి నగదు జమవుతుంది. లక్షకు రూ.6000-8000 కమీషన్ చొప్పున క్రిప్టో కరెన్సీగా(cryptocurrency) మార్చుతారు.

క్రిప్టో కరెన్సీగా మార్చి విదేశాలకు చేరవేత : హాంకాంగ్, దుబాయ్, మలేషియాల నుంచి చైనాకు చేరవేస్తున్నారు. ఇప్పటి వరకు సైబర్ నేరాల(Cyber Crime) దర్యాప్తులో పోలీసులు 3,4 లేయర్ల వద్దకు మాత్రమే వెళ్లగలుగుతున్నారు. 7వ లేయర్ వద్ద ఉన్న బాధితుల సొమ్మును గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా మాయగాళ్లు కాజేసిన వేలకోట్లు చివరికి ఎక్కడకు చేరాయనేది ప్రశ్నార్థకంగా మారింది. హవాలా మార్గంలో చైనా, దుబాయ్ చేరినట్టు అంచనా వేయటం మినహా ఇప్పటి వరకూ పక్కా ఆధారాలు సేకరించలేక పోతున్నారు. ఈ సమస్యను అధిగమించాలనే సంకల్పంతో నగర సైబర్ క్రైమ్ పోలీసులకు దర్యాప్తులో మరింత శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం అందించాలని భావిస్తున్నారు.

సైబర్ ముఠాలను గుర్తించేందుకు అనువుగా ఆర్థిక నేరాల దర్యాప్తు, నిందితుల అరెస్ట్​లను ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్, తదితర కేంద్ర దర్యాప్తు సంస్థలతో పోలీసులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈడీ సైతం ముఖ్యమైన కేసులను విచారణ చేయడానికి సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

Cyber Crime: గూగుల్​లో కస్టమర్​ కేర్​ నంబర్​ వెతికి ఫోన్​ చేస్తే..

Cyber Crime: అధిక లాభం పొందొచ్చని సైబర్ నేరగాళ్ల కుచ్చుటోపీ

ABOUT THE AUTHOR

...view details