తెలంగాణ

telangana

ETV Bharat / state

కుమార్తె పెళ్లి కోసం దాచిన సొమ్మును ఒక్క ఓటీపీతో దోచుకున్న సైబర్​ కేటుగాళ్లు - CYBER CRIMINALS RS 4 LAKHS STOLE

Daughter Wedding Money Stole Cyber Criminals : కేవలం ఒక్క ఓటీపీతోనే కుమార్తె పెళ్లి కోసం ఓ తండ్రి దాచుకున్న డబ్బును సైబర్​ నేరగాళ్లు దోచుకున్నారు. రూ.4 లక్షల నగదును బాధితుడి ఫోన్​కు బ్యాంకు లోగోతో లింక్​ పంపి డబ్బును కాజేశారు. దీంతో ఆ తండ్రి సైబర్​ పోలీసులకు, స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన నిజామాబాద్​ జిల్లా డొంకేశ్వర్​ మండలం గంగసముద్రం గ్రామంలో జరిగింది.

By ETV Bharat Telangana Team

Published : Jul 18, 2024, 6:46 PM IST

Daughter Wedding Money Stole Cyber Criminals
Daughter Wedding Money Stole Cyber Criminals (ETV Bharat)

Cyber Criminals Stole RS 4 Lakhs in Nizamabad : కుమార్తె పెళ్లి కోసం ఓ తండ్రి దాచుకున్న డబ్బులను సైబర్​ నేరగాళ్లు కాజేశారు. బాధితుడి ఫోన్​కు బ్యాంకు లోగోతో కూడిన లింక్​ పంపించిన దుండగులు ఎటువంటి ఓటీపీ చెప్పకుండానే రూ.4లక్షల నగదు దోచుకున్నారు. డబ్బులు కట్​ అయినట్లు మెసెజ్​ రావడంతో బ్యాంకు వెళ్లాడు. దీంతో ఖాతాను ఫ్రీజ్​ చేయించి సైబర్​ క్రైమ్​ పోలీసులతో పాటు స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన నిజామాబాద్​ జిల్లా డొంకేశ్వర్​ మండలం గంగసముద్రం గ్రామంలో జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నిజామాబాద్​ జిల్లా డొంకేశ్వర్​ మండలం గంగసముద్రం గ్రామానికి చెందిన ముత్యం రెడ్డికి నూత్పల్లి గ్రామంలో యూనియన్​ బ్యాంకులో ఖాతా ఉంది. అతను వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. తన కుమార్తె పెళ్లి కోసం అని చెప్పి అతను బ్యాంకు ఖాతాలో ఎక్కువ మొత్తంలో డబ్బును దాచుకున్నారు. ఈ క్రమంలో ఆయనకు ఈనెల 10న గుర్తు తెలియని నెంబరు నుంచి వాట్సాప్​లో బ్యాంకు లోగోతో మొదట ఒక లింక్​ వచ్చింది. ఆతర్వాత అదే రోజు మరొక లింక్​ వచ్చింది.

కేవలం ఓటీపీతో డబ్బు స్వాహా : మరుసటి రోజు లింకును చూసి క్లిక్​ చేయడంతో ఓటీపీతో పాటు 9361158830 నుంచి ఫోన్​ కాల్​ వచ్చింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడడంతో ముత్యంరెడ్డి ఫోన్​ కట్​ చేశాడు. అయితే ఈనెల 12న బ్యాంకు ఖాతా నుంచి మొదటిగా రూ.2 లక్షలు ఒకసారి, రూ.లక్ష ఒకసారి, రూ.50 వేలు, రూ.66,800 నగదు కట్ అయినట్లు బాధితుడి ఫోన్​కు మెసెజ్​ వచ్చింది. దీంతో రైతు లబోధిబోమంటూ వెంటనే ముత్యంరెడ్డి యూనియన్​ బ్యాంకుకు వెళ్లి ఖాతాను ఫ్రీజ్​ చేయించాడు. వెంటనే అక్కడి నుంచి సైబర్​ క్రైం నంబరుకు ఫోన్​ చేయడంతో పాటు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్​ఐఆర్​ నమోదు చేశారు. అనంతరం దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో స్మార్ట్​ఫోన్​కు వచ్చిన గుర్తు తెలియని లింకులను క్లిక్​ చేయవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అలాగే గుర్తు తెలియని వ్యక్తులకు ఓటీపీలు చెప్పవద్దని ప్రజలకు సూచించారు.

రాష్ట్రంలో పెరిగిపోతున్న సైబర్ మోసాలు - జాగ్రత్తగా లేకుంటే జేబుకు చిల్లే - Cyber Crime Cases in Telangana

OTP లేకుండానే ఫోన్​ పే లాగిన్- పేమెంట్​ యాప్​లో బగ్​ గుర్తించిన యువకుడు- సంస్థ రియాక్షన్ ఇదే! - PhonePe Bug

ABOUT THE AUTHOR

...view details