Cyber Crime Awareness And Security :మాతృభాషలో మాత్రమే కాదు ఇతర భాషల్లోనూ మంచి పట్టుంది. ఇంకేముంది కెరీర్లో దూసుకుపోవచ్చు. తక్కువ కాలంలోనే ఉన్నతస్థాయికి చేరొచ్చు. ఇది కాయిన్‌కు ఒకవైపు మాత్రమే. అలా నేర్చుకున్న ఇంగ్లీష్, హిందీ భాషలు సైబర్ మాయగాళ్ల బారినపడేలా చేస్తాయని జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కు స్పందించవద్దని సూచిస్తున్నారు.
హిందీ, ఇంగ్లీష్ భాషలు తెలిసిన వారిపై సైబర్ గాలం :ఇప్పటి వరకూ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కేందుకు అమాయకత్వం, అవగాహనలోపమే కారణమని పోలీసులు భావించారు. వీటన్నింటికీ మించి నగరంలో ఎక్కువ మందికి హిందీ మాట్లాడటం రావటం వల్ల కూడా మోసాల బారినపడేందుకు ఒక కారణమని కారణమంటున్నారు. సీబీఐ, ఈడీ, సైబర్‌క్రైమ్ పోలీసులమంటూ ఫోన్‌కాల్ చేస్తున్న కేటుగాళ్లు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడుతూ తమని తాము పరిచయం చేసుకుంటున్నారు. ఆ రెండు భాషలు తెలిసిన వారు వేగంగా స్పందిస్తున్నారు. అదనపు ఆదాయం వస్తుందనే ఆశతో తమ కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. జీవితంలో ఎదిగేందుకు ఊతమిచ్చే కమ్యూనికేషన్ స్కిల్స్ సైబర్ నేరస్థులకు వరంలా మారింది.
సైబర్ ముఠాలు కూడా హిందీ, ఇంగ్లీష్ భాషలు తెలిసిన యువకులకు పెద్దమొత్తంలో కమీషన్ ఆశచూపి ఏజెంట్లుగా మార్చుకుంటున్నాయి. వారి ద్వారానే ఉద్యోగులు, గృహిణుల, వ్యాపారులను మోసగిస్తున్నారని అప్రమత్తంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు.