అవినీతి శాఖల జాబితాలో ఎక్సైజ్ కూడా చేరింది - ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆసక్తికర ట్వీట్
CV Anand Sensational Tweet on Corruption Departments : ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ ఆసక్తికర ట్వీట్ చేశారు. రాష్ట్రంలోని అత్యంత అవినీతి శాఖల్లో ఎక్సైజ్ శాఖ ఒకటని ఎక్స్ వేదికగా సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖ ఇందులోకి చేరిందని ట్వీట్ చేశారు.
Published : Jan 24, 2024, 4:51 PM IST
CV Anand Sensational Tweet on Corruption Departments :ప్రభుత్వ శాఖల్లో అవినీతి నెలకొందని, ఎదైనా ముట్టజెప్పనిదే గానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు పూర్తయ్యేలా లేదని ప్రజలు, విపక్షాలు ఆరోపించడం చూస్తుంటాం. కానీ ఏకంగా ఓ ఐపీఎస్ అధికారి ప్రభుత్వ శాఖల్లో అవినీతి నెలకొందని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలోని అవినీతి శాఖల్లోకి మరో శాఖ చేరిందని ఎక్స్ వేదికగా తెలపడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు డైనమిక్ ఆఫీసర్‌గా పేరు తెచ్చుకున్న ఏసీబీ డీజీ సీవీ అనంద్(CV Anand). రాష్ట్రంలోని అత్యంత అవినీతి శాఖల్లో ఎక్సైజ్ శాఖ ఒకటని ఎక్స్ వేదికగా సీవీ ఆనంద్ పేర్కొన్నారు. రెవెన్యూ, పోలీసు, రవాణా శాఖలతో పాటు ఎక్సైజ్ శాఖ ఇందులోకి చేరిందని ట్వీట్ చేశారు.