తెలంగాణ

telangana

ETV Bharat / state

అత్యంత ప్రమాదకర బల్లుల అక్రమ రవాణా - సీజ్​ చేసిన విశాఖ కస్టమ్స్​ అధికారులు - CUSTOMS SEIZED EXOTIC LIZARDS

థాయ్‌లాండ్‌ నుంచి భారత్​కు అత్యంత ప్రమాదకరమైన బల్లులు - వైజాగ్​ ఎయిర్​పోర్ట్​లో సీజ్​ చేసిన కస్టమ్స్​, డీఆర్‌ఐ అధికారులు

Foreign Lizards Smuggled in Cake Box
Foreign Lizards Smuggled in Cake Box (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 5:08 PM IST

Updated : Nov 27, 2024, 5:24 PM IST

Foreign Lizards Smuggled in Cake Box : ప్రమాదకర బల్లుల్ని అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు ప్రయాణికులను, విశాఖ విమానాశ్రయ అధికారులు పట్టుకున్నారు. మూడు నీలిరంగు నాలుక బల్లులు, మరో 3 వెస్ట్రన్‌ బల్లులను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 23న బ్యాంకాక్, థాయిలాండ్ నుంచి విశాఖ వస్తున్న ఇద్దరు ప్రయాణికులు, కేక్ ప్యాకెట్లలో వీటిని దాచి ఉంచి.. తీసుకొస్తుండగా గుర్తించినట్లు డైరెక్టరేట్‌ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్‌ అధికారులు గుర్తించారు. డీఆర్‌ఐ, అటవీశాఖ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన సోదాల్లో వీటిని ఐడెంటిఫై చేసినట్లు చెప్పుకొచ్చారు. స్వాధీనం చేసుకున్న బల్లులను డీఆర్‌ఐ ఆఫీసర్లు ఎయిర్‌పోర్టు పోలీసులకు అప్పగించారు. అనంతరం వన్యప్రాణి సంరక్షణ చట్టం సహా అన్యదేశాల అటవీ జంతువుల అక్రమ రవాణా సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

బ్యాంకాక్ టూ హైదరాబాద్‌ ఫ్లైట్​లో పాములు : ఇటీవల కాలంలో ఉభయ తెలుగు రాష్ట్రాల విమానాశ్రయాల్లోనూ తరచూ ఇటువంటి ప్రమాదకర బల్లులు, పాముల అక్రమ రవాణా సంఘటనలు జరుగుతున్నాయి. జనరల్​గా పలు విమానాశ్రయాల్లో కస్టమ్స్‌ అధికారుల తనిఖీల్లో డ్రగ్స్‌, బంగారం పట్టుబడతాయి. వాటిని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకోవటం అందరికీ తెలిసిందే. కానీ ఈ మధ్య పలువురు ప్రయాణికుల చేస్తున్న అక్రమ రవాణా దందాలు, తోటి ప్రయాణికులను సైతం బెంబేలెత్తిస్తున్నాయి. అంతే కాకుండా దానివెనుక ఏ కుట్ర కోణం దాగివుందో తెలియని అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్యన బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన విమాన ప్రయాణికుల బ్యాగులను విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళల వద్ద విష సర్పాలను ఐడెంటిఫై చేశారు. వెంటనే ఆ ఇద్దరు ప్రయాణికులను అదుపులోకి తీసుకొని విచారించారు.

ఈ విషపూరితమైన పాములను బ్యాంకాక్‌ నుంచి ఇక్కడికి ఎందుకు తెచ్చారు? పాముల సరఫరా వెనుక ఏదైనా కుట్ర, అసాంఘీక చర్య ఉందా? అన్న కోణంలో విచారణ చేపట్టారు. అక్కడ పట్టుకున్న పాములను అనకొండలుగా భావిస్తున్నారు. పాములను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్న విషయం తెలిసి బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ ప్రయాణించిన ఇతర ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ప్రయాణ సమయంలో బ్యాగుల్లోని పాములు, బల్లులు బయటికొస్తే తమ పరిస్థితి ఏంటిని ఆందోళన చెందుతున్నారు.

విమానంలో పాములు - బెదిరిపోయిన ప్రయాణికులు - బ్యాంకాక్ టు హైదరాబాద్‌ ఫ్లైట్​లోనే

సూట్​కేసుల్లో కోతులు, తాబేళ్లు సహా 40 అరుదైన జీవుల స్మగ్లింగ్- ఎయిర్​పోర్ట్ ఆఫీసర్స్ షాక్

Last Updated : Nov 27, 2024, 5:24 PM IST

ABOUT THE AUTHOR

...view details