Asia Pacific CEO Matthew Bouw Met CM Revanth Reddy :హైదరాబాద్‌ను న్యూయార్క్ నగరంలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని హైదరాబాద్‌ను ప్రపంచంలోని ప్రముఖ నగరాల్లో ఒకటిగా నిలబెట్టాలనేది తమ సంకల్పమని సీఎం అన్నారు. ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు మార్గాల విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారు కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మాథ్యూ భౌ బృందం భేటీ అయింది.
Telangana New ITI Colleges : హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్న విధానంపై సమావేశంలో చర్చ జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తమ అధ్యయనంలో తేలిందని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ కంపెనీ ప్రతినిధి బృందం వివరించింది. గడిచిన ఆరు నెలల్లో రియల్టీతో పాటు లీజింగ్, ఆఫీసు స్పేస్, నిర్మాణ రంగం, రెసిడెన్షియల్ స్పేస్‌లోనూ హైదరాబాద్ సిటీ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని ఆ సంస్థ పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ఆరు నెలలకోసారి వెల్లడించే తమ నివేదిక జులై నెలాఖరులో వెలువడుతుందని పేర్కొంది. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.