Chocolate ChessBoard in Hyderabad :వామ్మో అతిపెద్ద చెస్ బోర్డు చూడగానే ఒక్కో గడిలో అడుగు పెడుతూ పావులతో ఎత్తులు వేయొచ్చు అనుకుంటున్నారా? అయితే మీరు చాక్లెట్‌లో కాలు వేసినట్లే. ఎందుకంటే దీన్ని 250 కిలోల చాక్లెట్‌తో తయారు చేశారు. హైదరాబాద్ బేగంపేటలోని కలినరీ అకాడమీ క్రిస్మస్ సందర్భంగా 16 అడుగుల వెడల్పు 16 అడుగుల పొడవుతో 256 చదరపు అడుగుల విస్తీర్ణం గల అతిపెద్ద చదరంగం బోర్డుని తయారు చేసింది.
సోమవారం నాడు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొ.బాలకిష్టారెడ్డి, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేశం అతిథులుగా హాజరై చెస్ బోర్డును ఆవిష్కరించారు. 25 మంది చెఫ్‌లు వారం పాటు శ్రమించి దీనిని రూపొందించారని కలినరీ అకాడమీ ఛైర్మన్ సుధాకర్‌రావు తెలిపారు. ప్రపంచ రికార్డు కోసం ఈ ప్రయత్నం చేసినట్లు ఆయన చెప్పారు.