యుద్ధప్రాతిపదికన మేడిగడ్డ మరమ్మతులు - నేడు బ్యారేజీని పరిశీలించనున్న సీఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధులు (ETV Bharat) Medigadda Barrage Temporary Repairs :మేడిగడ్డ ఆనకట్టకు సంబంధించిన అన్ని పనులు వేగవంతంగా సాగుతున్నాయి. దెబ్బతిన్న సీసీ బ్లాకుల స్థానాల్లో కొత్తవాటిని అమర్చడం, షీట్ ఫైల్స్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతోంది. ఆనకట్ట ఏడో బ్లాకులో దెబ్బతిన్న పియర్స్ ప్రాంతంలో ఉన్న గేట్ల తొలగింపు ప్రక్రియ కూడా సాగుతోంది. తెరవడానికి వీలు కాని నాలుగు గేట్లను కటింగ్ ద్వారా తొలగించాల్సి ఉంది. 20వ నంబర్ గేట్‌కు సంబంధించిన కటింగ్ ప్రక్రియ చేపట్టారు. ఒక్కో గేటు కటింగ్‌కు మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు.
నాలుగు గేట్లను ఇదే తరహాలో తొలగించనున్నారు. అటు బ్యారేజ్ ముందు భాగంలో ఏర్పడిన రంధ్రాన్ని పూడ్చే పనులను కూడా ప్రారంభించారు. ముందుగా ఆ ప్రాంతంలో డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఈ విధానంలో రంధ్రం పరిమాణంపై ఓ అంచనాకు వస్తారు. ఆ తర్వాత ఇసుకతో గ్రౌంటింగ్ చేస్తారు. రెండు రోజుల్లో గ్రౌటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు. వీటితో పాటు అవసరమైన ఇతర పనులను కూడా చేపడుతున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ అప్డేట్ - గేట్ల తొలగింపు పనులు షురూ - MEDIGADDA BARRAGE GATES REPAIR
మేడిగడ్డను పరిశీలించనున్న సీఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధులు :వర్షాలు సమీపిస్తున్న తరుణంలో పనులు వేగవంతం చేయాలని, రాత్రి పగలు చేయాలని నిర్మాణ సంస్థ ఎల్అండ్టీకి ఇంజినీర్లు స్పష్టం చేశారు. అటు ఎన్డీఎస్ఏ సిఫార్సులకు అనుగుణంగా తీసుకోవాల్సిన చర్యలపై ఈఎన్సీ జనరల్ నేతృత్వంలో ఏర్పాటైన ఇంజినీర్ల కమిటీ సోమవారం మేడిగడ్డతో పాటు అన్నారం ఆనకట్టలను పరిశీలించింది. చేయాల్సిన పనులు, పరీక్షలకు సంబంధించి వారికి సూచనలు చేశారు.
మేడిగడ్డ ఆనకట్టకు నిపుణుల కమిటీ సూచించిన తదుపరి పరీక్షలను దిల్లీకి చెందిన సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్స్ రీసెర్చ్ స్టేషన్ నిర్వహించనుంది. సీఎస్ఎంఆర్ఎస్ ప్రతినిధులు రేపు మేడిగడ్డ ఆనకట్టను పరిశీలించనున్నారు. అన్నారం ఆనకట్టకు పుణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సీడబ్ల్యూపీఆర్ఎస్ పరీక్షలు చేయనుంది. సుందిళ్ల ఆనకట్ట పరీక్షల పనులను నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఎన్జీఆర్ఐకి అప్పగించే అవకాశం ఉంది. వర్షాలను దృష్టిలో పెట్టుకొని వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ఈఎన్సీ బృందం - భారీ బుంగలపై తీసుకోవల్సిన చర్యలపై పలు సూచనలు
శరవేగంగా మేడిగడ్డ మరమ్మతులు - కొనసాగుతున్న గేట్ల కటింగ్ పనులు - MEDIGADDA BARRAGE GATES REPAIR