Criminal Proceedings Against Former Minister Perni Nani By Order Of Civil Supplies MD : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) గోదాములో రేషన్ బియ్యం గల్లంతయ్యాయి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోదాములో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్‌జీర్ జిలానీ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం గల్లంతుపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా, గోదాముల యజమానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం నాని దాదాపు రూ.1.80 కోట్లు జరిమానా చెల్లించడంతోపాటు క్రిమినల్ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నానికి చెందిన దాదాపు 40 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ద్వారా పౌరసరఫరాల సంస్థ 2020లో వైఎస్సార్సీపీ హయాంలో అద్దెకు తీసుకుంది. బస్తాకు నెలకు రూ.5 వరకు అద్దె చెల్లిస్తుంది. దీన్ని బఫర్ - ఇన్వెస్టర్ గోదాములుగా వినియోగిస్తుంది. ఇక్కడ నిర్వహణ అంతా ప్రైవేటు యాజమాన్యం తీసుకుంటుంది. కేవలం పర్యవేక్షణ మాత్రం పౌరసరఫరాల సంస్థ చూస్తుంది. గోదాముల యజమాని ఆధ్వర్యంలోనే మేనేజర్, ఇతర సిబ్బంది ఉంటారు. కార్పొరేషన్ ఆధ్వర్యంలో జిల్లా మేనేజరు ఎప్పటికప్పుడు నిల్వలు పరిశీలించాల్సి ఉంటుంది.
రెండు, మూడు రోజుల్లో కాకినాడకు సిట్ బృందం - రేషన్ మాఫియాలో గుబులు