Couple Suicide in Mahabubabad District : ఉరేసుకుని దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెంలో జరిగింది. గత నెల అనిల్, దేవి దంపతులు తమ ఇద్దరు చిన్నారులకు పురుగుల మందు ఇచ్చి హత్య(Children Murder) చేసిన అనంతరం పరార్ అయ్యారు. ఇప్పుడు తాజాగా అంకన్నగూడెం శివారు అటవీప్రాంతంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని కనిపించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దాదాపు నెల రోజుల క్రితం ఉరేసుకొని ఉంటారని అందుకే మృతదేహాలు కుళ్లిన స్థితిలో లభ్యమయ్యాయని పోలీసుల తెలిపారు.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం: మార్చి 10వ తేదీన మహబూబాబాద్ జిల్లాలోని గార్ల మండలం అంకన్న గూడెనికి చెందిన అనిల్, దేవి దంపతులు తమ చిన్నారులకు పాలలో పురుగుల మందు కలిపి తాగించి హతమార్చారు. అనంతరం వారు అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై పరారైపోయారు. వారి కోసం పోలీసులు గత కొంతకాలంగా గాలిస్తున్నారు. చివరకు ఇవాళ కుళ్లిన స్థితిలో వారి మృత దేహాలు లభించాయి.
ఎంసెట్ క్లాసులు అర్థం కావడం లేదని- తండ్రి పుట్టిన రోజున కుమారుడి ఆత్మహత్య
Couple Committed Suicide : 15 రోజుల క్రితం వీరి ద్విచక్ర వాహనం నామాలపాడు అటవీ ప్రాంతంలో లభ్యమైందని స్థానికులు పోలీసులకు తెలిపారు. ఈ క్రమంలో చుట్టుపక్కల, అటవీ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. గాలింపు చర్యల్లో భాగంగా శుక్రవారం ఉదయం అంకన్న గూడెం శివారులోని అటవీ ప్రాంతంలో 2 మృతదేహాలు కనిపించడంతో గార్ల పోలీసులకు సమాచారం అందించారు.
కుళ్లిన స్థితిలో లభ్యమైన మృతదేహాలు : వెంటనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఆ దంపతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా వారు వచ్చి ఆ దంపతులు ధరించిన దుస్తులు ఆధారంగా నిర్ధారించారు. ఇక్కడ అనిల్ మృతదేహం చెట్టుకు ఉరివేసుకుని ఉండగా, దేవి మృతదేహం మాత్రం కింద పడిపోయి పుర్రె, ఎముకలు చెల్లాచెదురై పడిపోయి ఉన్నాయి. దీని ప్రకారం చూస్తే వారు ఆత్మహత్య(Couple Suicide in Mahabubabad) చేసుకుని దాదాపు నెల రోజులు అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య ముక్కు కోసేసిన భర్త.. అడ్డొచ్చిన కుమార్తెకు ఉరి.. ఆపై సూసైడ్
ఫోన్ ఎక్కువగా మాట్లాడుతోందని.. గొంతు నులిమి కుమార్తె హత్య