తెలంగాణ

telangana

ETV Bharat / state

మనం KG కొంటే 800 గ్రాములే ఇస్తున్నారంట! - ఏదైనా కొనేటప్పుడు కాస్త చూసుకోండి గురూ

నిత్యావసర వస్తువులు కొనేటప్పుడు ఎక్కువగా జరుగుతున్న తూకం మోసాలు - కిలో తీసుకుంటే 50 గ్రాములు తక్కువగా వస్తున్న కూరగాయలు - పట్టించుకోని తూనికలు, కొలతలు అధికారులు

Traders Doing Huge Fraud
Traders Doing Huge Fraud (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : 4 hours ago

Traders Doing Huge Fraud in Weight : నిత్యం మనం మార్కెట్​కు వెళ్లి కూరగాయలు, మాంసం వంటివి కొనుగోలు చేస్తుంటాం. ముఖ్యంగా నిత్యావసర సరకులు రోజూ ఏదో ఒకటి కొనుగోలు చేస్తూనే ఉంటాం. కానీ అక్కడ తూకం వేసేటప్పుడు జరుగుతున్న మోసాలను అసలు గుర్తించం. కిలో తీసుకుంటే దాదాపు 100 గ్రాములు తక్కువగానే ఐటమ్స్​ వస్తున్నాయట. కానీ ఆ విషయాన్ని మనం గుర్తించం. ఒక్క బహిరంగ మార్కెట్​లోనే కాకుండా షాపింగ్స్​ మాల్స్​, ఎలక్ట్రానిక్​ దుకాణాల్లోనూ ఇలాగే జరుగుతుందట. ఇంత జరుగుతున్నా తూనికలు, కొలతల అధికారులు మాత్రం నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతున్నారు.

  • హైదరాబాద్​లో రామస్వామి అనే ఓ వ్యక్తి మార్కెట్​కు వెళ్లి కిలో చేపలు కొన్నాడు. అక్కడ తూకం వేస్తే సరిగ్గా కిలోనే ఉన్నాయి. అనుమానం వచ్చి బయట తూకం వేయగా 800 గ్రాములు మాత్రమే వచ్చింది. ఇదేంటని అతని వద్దకు వెళ్లి అడగ్గా, తనది సరైన తూకమేనని వాదించాడు. చేసేదిలేక అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
  • సతీశ్​ అనే యువకుడు షాపింగ్​ మాల్​కి వెళ్లి చొక్కాను కొనుక్కున్నాడు. ఆ చొక్కాపై రూ.800 స్టిక్కర్​ ఉంది. నిషితంగా పరిశీలిస్తే దాని కింద మరో స్టిక్కర్​ ఉండటం గమనించాడు. తయారీదారుడు వేసిన స్టిక్కర్​ను దుకాణం వ్యాపారి కనిపించకుండా మరో స్టిక్కర్​ వేసినట్లు గుర్తించాడు.
  • గణేశ్​ అనే యువకుడు మార్కెట్​కు వెళ్లి ఐదు కిలోల కూరగాయలను కొన్నాడు. వాటిని బయట తూకం వేస్తే 4.5 కిలోలు మాత్రమే వచ్చాయి. దీంతో తూకంలో తేడా గమనించి ఆశ్చర్యపోయాడు.
  • రోజువారి కూలీ ఓ దుకాణానికి వెళ్లి కూల్​ డ్రింక్​ తీసుకున్నాడు. కూల్​డ్రింక్​ అంతా తాగేశాడు. ఎందుకో అనుమానం వచ్చి కూల్​డ్రింక్​పై ఉన్న తేదీని గమనించాడు. చూస్తే గడువు తీరిపోయి ఉంది. దీంతో వ్యాపారిని నిలదీస్తే చూసుకోలేదని సమాధానం ఇచ్చాడు.

ప్రతి రోజు లక్షల్లో మోసాలు : ఇవే కాదు. ఇలాంటి సంఘటనలు రాష్ట్రవ్యాప్తంగా రోజుకు లక్షల్లో జరుగుతున్నాయి. ఈ మోసాలను అరికట్టే తూనికలు, కొలతల శాఖ మాత్రం మొద్దు నిద్ర వహిస్తోంది. వ్యాపారులు విచ్చలవిడిగా తూనికలు వేస్తూ సామాన్య జనం నుంచి గట్టిగానే డబ్బులు లాగేస్తున్నారు. ఇలాంటివి వారాంతపు సంతల్లో ఎక్కువగా జరుగుతాయి. కానీ అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు ఉంటుండగా, వ్యాపారులను వినియోగదారులు ప్రశ్నిస్తే తిరిగి దాడి చేసే సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

పట్టించుకోని అధికారులు : తూనికలు, కొలతల శాఖ అధికారులు ప్రతి ఆదివారం కూరగాయలు, చేపల మార్కెట్, రైతు బజార్లు, ఇతర ప్రాంతాల్లో తనిఖీలు చేసేవారు. ఈ సందర్భంగా తూనికల్లో మోసాలను ఎలా గుర్తించాలో వినియోగదారులకు అవగాహన కల్పించేవారు. ప్రస్తుతం అలాంటి తనిఖీలు లేవు. ఎప్పుడో ఒకసారి చేసి మమ అనిపించేస్తున్నారు. పాత తరపు బాట్లను రెండేళ్లకు ఒకసారి మార్పించుకోవాల్సి ఉండగా, అధికారులు వాటిని పరిశీలించి, అరిగిన వాటిలో సీసం కరగబోసి సరైన తూకం వచ్చేలా చూస్తారు. దానిపై తేదీ, బరువుతో కూడిన ముద్రను వేస్తారు. అయితే ఈ ప్రక్రియ గత కొన్నేళ్లుగా అమలు కావడం లేదు.

ఈ జాగ్రత్తలు పాటించండి :

  • మార్కెట్​లో కూరగాయలు కొనేటప్పుడు తూకాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. అనుమానం వస్తే మరో చోట తూకం వేయించాలి. తక్కువగా వస్తే అమ్మకందారుడిని ప్రశ్నించాలి.
  • చేపల మార్కెట్​లో అయితే మొదట కొనుగోలు చేసిన తర్వాత ఆ తర్వాతనే అక్కడ మరో ఎలక్ట్రానిక్​ తూకం ఉంటుంది. దానిలో సరి చూసుకుంటే సరిపోతుంది.
  • ప్యాకింగ్​ చేసిన వస్తువుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్యాకింగ్​పై ముద్రించిన తేదీ, చిరునామా, ఎమ్మార్పీ వంటి తదితర వివరాలు చూసుకోవాలి. ఎమ్మార్పీ అతికించిన చోట స్టిక్కరు అతికించి మరో ధరను చూపిస్తుంటే విక్రయదారుడిని నిలదీయాలి.

కిలోకు 800 గ్రాములే ఇస్తున్నారట - మాంసం ప్రియులారా కాస్త చూసుకొని తీసుకోండి

DMart Fraud : డీమార్టులో ఈ మోసాన్ని ఎప్పుడైనా గమనించారా.. మీరే చూడండి

ABOUT THE AUTHOR

...view details