తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వంపై హరీశ్​రావు విషప్రచారాలు మానుకోవాలి : విప్ ఆది శ్రీనివాస్ - VIP Aadi Srinivas Slams Harishrao - VIP AADI SRINIVAS SLAMS HARISHRAO

VIP Aadi Srinivas Slams Harishrao : రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని, హరీశ్​రావు దుఃఖంలో మునిగిపోయారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ అవుతుందన్న బెంగతో హరీశ్​రావుకు కన్నీళ్లు ఆగడం లేదని ఆయన ఆరోపించారు. రైతులను రెచ్చగొట్టడమే హరీశ్​రావు పనిగా మారిందని, రుణమాఫీపై విషప్రచారాలు చేయడం మానుకోవాలని తెలిపారు.

MLA Aadi Srinivas Fires on Harishrao
VIP Aadi Srinivas Slams Harishrao (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 8, 2024, 7:37 PM IST

Updated : Sep 8, 2024, 7:46 PM IST

MLA Aadi Srinivas Fires on Harishrao : రుణమాఫీపై రైతులను రెచ్చగొట్టేందుకు మాజీమంత్రి హరీశ్​రావు చేస్తున్న ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించవని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ప్రభుత్వంపై పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. రైతుల గురించి బీఆర్ఎస్ నాయకులు హరీశ్​రావు, కేటీఆర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని ఆది శ్రీనివాస్ హితవు పలికారు.

రైతులను రెచ్చగొడుతున్నారు :రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని హరీశ్​రావు దుఃఖంలో మునిగిపోయారని అది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. రుణమాఫీ అవుతుందన్న బెంగతో ఆయనకు కన్నీళ్లు ఆగడం లేదని ఆరోపించారు. రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మాట నిలబెట్టుకున్నారన్న ఉక్రోశంతో హరీశ్​రావు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులను రెచ్చగొట్టడమే హరీశ్​రావు పనిగా మారిందని విమర్శించారు.

రైతులను పరామర్శించలేదు : మామ ఫామ్​హౌస్​లో, బామ్మర్ది అమెరికాలో జల్సా చేస్తుంటే హరీశ్​రావు హైదరాబాద్​లో విషం చిమ్ముతున్నారని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు. రైతులపైన అంత ప్రేమ ఉంటే కేసీఆర్​తో హరీశ్​రావు ఎందుకు ఒక ప్రకటన కూడా చేయించలేదని ప్రశ్నించారు. వర్షాల కారణంగా నష్టపోయిన ఒక్క రైతును కూడా ఎందుకు కేసీఆర్ పరామర్శించలేదని నిలదీశారు. మేనిఫెస్టోలో ఏమి పెట్టామో, అది చేస్తున్నామన్న ఆయన రుణమాఫీకి తమ ప్రభుత్వం ఏలాంటి కొత్త నిబంధన పెట్టలేదని పేర్కొన్నారు.

రుణమాఫీపై గత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలే తాము అనుసరించినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. రెండు లక్షలకుపైగా ఉన్న రుణాన్ని ఎందుకు చెల్లించాలని హరీశ్​రావు అడుగుతుండడాన్ని ఆయన తప్పు బట్టారు. రైతులను రుణ విముక్తి చేసి మళ్లీ రుణం తీసుకోవాలన్నదే తమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

"రుణమాఫీపై బీఆర్ఎస్ నేత హరీశ్​రావు ప్రజలలో విష ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉంది. ప్రతి కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ కచ్చితంగా చేస్తాము. అనివార్య కారణాల వల్ల ఆగిపోయిన రైతులకు రుణమాఫీ చేస్తాము. ఓ వైపు వరదలతో అతలాకుతలమవుతున్న ప్రజలను పట్టించుకోకుండా, రాజకీయాలు చేస్తున్నారు".- ఆది శ్రీనివాస్‌, ప్రభుత్వ విప్‌

వరద బాధితులకు అండగా కదిలొచ్చిన కాంగ్రెస్ నేతలు - 2 నెలల వేతనం విరాళంగా ప్రకటన - Congress Donates to Flood Victims

NSUI రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుంచి పీసీసీ పీఠం వరకు - మహేశ్‌కుమార్‌ గౌడ్‌ రాజకీయ ప్రస్థానమిదే - PCC President Mahesh Kumar Goud

Last Updated : Sep 8, 2024, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details