Congress Focus On 15 MP Seats In Telangana: తెలంగాణ రాష్ట్రంలో 15 లోకసభ స్థానాలు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ముందుకు వెళ్తుంది. కాని నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు కాంగ్రెస్ నాయకులు, పార్టీ శ్రేణులు ప్రస్తుతం మారుతున్నరాజకీయ పరిణామాలతో మరింత శ్రమించాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నట్లు పార్టీ అంచనా వేస్తోంది. మాలమాదిగలకు టికెట్ల కేటాయింపులో సమన్యాయం పాటించకపోవడం, బీఆర్‌ఎస్, బీజేపీ ముందు నుంచి విస్తృతంగా ప్రచారం చేస్తుండడం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ మూడు స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించలేకపోవడం లాంటివి కాంగ్రెస్ కొంత కలిసిరాని అంశాలుగా చెప్పవచ్చు.
మార్చిలో నిర్వహించిన సర్వేలో అభ్యర్ధులతో సంబంధం లేకుండానే 12 లోకసభ స్థానాలల్లో కాంగ్రెస్ విజయానికి అవకాశాలు ఉన్నట్లు వెల్లడైంది. కాని గడిచిన పది రోజులుగా క్షేత్రస్థాయిలో ఓటర్ల నాడి మారుతున్నట్లు అంచనా వేస్తున్నపార్టీ దానిని అధికమించేందుకు సత్వర చర్యలు చేపడుతోంది. పలు నియోజకవర్గాల్లో అభ్యర్ధులు ఆశించిన స్థాయిలో ప్రచారం చేయడం లేదని భావిస్తున్నరాష్ట్ర నాయకత్వం ఆలాంటి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
మెజార్టీ సీట్లే లక్ష్యంగా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం - జాతీయ నాయకులతో బహిరంగ సభలు - Lok Sabha Elections 2024
Telangana Lok Sabha Elections 2024 :నల్గొండ, భువనగిరి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ నియోజకవర్గాలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, నిజామాబాద్ నియోజకవర్గాల్లో బీజేపీకి సానుకూలంగా ఉన్నట్లు క్షేత్రస్థాయి పరిస్థితులు వెల్లడిస్తున్నాయి. హైదరాబాద్ స్థానం ఎంఐఎంకు వదిలి పెడితే మిగిలిన చేవెళ్ల, జహీరాబాద్, మెదక్ నియోజకవర్గాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌ల మధ్య త్రిముఖ పోటీ ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేకపోవడంతో చేరికలను ప్రోత్సహించి పార్టీని బలోపేతం చేసుకునే దిశలో చొరవ చూపుతోంది. అయినా కూడా ఆశించిన స్థాయిలో మార్పు కనిపించలేదన్న ఆందోళన పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి, సికింద్రాబాద్, చేవెళ్ల లోకసభ స్థానాలపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్‌ను దీటుగా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ అభ్యర్ధి సునీతా మహేందర్ రెడ్డి మరింత శ్రమించాల్సి వస్తోంది.
Congress Election Campaign in Telangana :అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు దానం నాగేందర్‌ను బరిలోదించినప్పటికీ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధి మారతారని విస్తృతంగా ప్రచారం జరగడం ఆశించిన స్థాయిలో ప్రచారం జరగడం లేదన్నభావనతో వెనుకబడి ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. చేవెళ్లలో రంజిత్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ అయినప్పటికీ బీజేపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో ఓటర్లను ప్రసన్నం చేసుకోడానికి కాంగ్రెస్ పార్టీ మరింత శ్రమించాల్సి వస్తోంది.
సాధారణంగానే ఇక్కడ ఉన్నత వర్గాలు ఓట్లు వేసే శాతం చాలా తక్కువ ఉంటున్నందున మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ఓట్లపై దృష్టి పెట్టాల్సి ఉంది. ఆయా వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఏయే ప్రాంతాల్లో ఏయే సామాజిక వర్గాల ప్రజలు ఉన్నారు వారిని పార్టీ వైపు తిప్పుకోడానికి ఉన్న అవకాశాలపై కూడా ఆరా తీస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను కూడా గడపగడపకు తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్దం చేస్తోంది.
లోక్‌సభ ప్రచార బరిలో జోరు పెంచిన కాంగ్రెస్ - 15 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా నేతల వ్యూహాలు - Congress campaign six guarantees
మల్కాజిగిరిపై కాంగ్రెస్ గురి - భారీ మెజార్టీతో గెలిచేందుకు స్పెషల్ ఆపరేషన్ - lok sabha elections 2024