08.21 PM
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలి : సీఎం రేవంత్
లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలి. జూన్ 9న దిల్లీలో మువ్వెన్నల జెండా ఎగరాలి. బీఆర్‌ఎస్‌ను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో బీజేపీను అలాగే ఓడించాలి. కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలి.కార్యకర్తల కష్టం వల్లే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. గుజరాత్ మోడల్‌పై వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తోంది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారు. పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ 750 మంది రైతులు చనిపోయారు. 750 మంది రైతులు చనిపోతే వాళ్ల కుటుంబాలను మోదీ పరామర్శించలేదు.
08.09 PM
బీఆర్‌ఎస్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపోయింది : డిప్యూటీ సీఎం భట్టి
బీఆర్‌ఎస్ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని తెచ్చిపోయిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటో తేదీన ఉద్యోగస్థులకు జీతాలు ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఉపముఖ్యమంత్రి చెప్పారు. రాహుల్ నిరంతర పర్యవేక్షణ వల్లే ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించామన్నారు. ప్రజలందరికీ న్యాయం జరగాలనే న్యాయపత్రం విడుదల చేశామని చెప్పారు.
08.03 PM
కాంగ్రెస్‌పై కేసీఆర్ బురద జల్లేందుకు యత్నించారు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
'కాంగ్రెస్‌పై కేసీఆర్ బురదజల్లేందుకు యత్నిస్తున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడూ వర్షాలు పడలేదు. కృష్ణా, గోదావరి జలాల్లో కేసీఆర్ లూటీ చేశారు. 4 నెలలు ఫామ్‌హౌజ్‌లో ఉండి కేసీఆర్ ఇప్పుడు బయటకొచ్చారు. పదేళ్లపాటు బీజేపీ, బీఆర్‌ఎస్ ప్రజలను మోసం చేశాయి.'
08.00 PM
'మేడిన్ చైనా' కంటే మిన్నగా 'మేడిన్ తెలంగాణ' కావాలి : రాహుల్
ప్రజల స్వప్నం సాకారం చేసేందుకు రాష్ట్రాన్ని ఇచ్చాం. ఈ కొత్త రాష్ట్రం దేశానికే మార్గం చూపించాలి. 'మేడిన్ చైనా' కంటే మిన్నగా 'మేడిన్ తెలంగాణ' కావాలి. దేశంలో బీజేపీ విద్వేషాలు రెచ్చగొడుతోంది. మతసామరస్యానికి ప్రతీక తెలంగాణ, తెలంగాణ సందేశాన్ని దేశం మెుత్తం చెబుతా.
07.57 PM
తెలంగాణ ప్రజల సిపాయిలాగా దిల్లీలో ఉంటా : రాహుల్
నాకు, ప్రజలకు ఉన్న సంబంధం రాజకీయాలకు అతీతం. నాకు, ప్రజలకు ఉన్న సంబంధం కుటుంబసంబంధం. తెలంగాణ ప్రజల సిపాయిలాగా దిల్లీలో ఉంటా. నా జీవితాంతం చిన్నపిల్లలు పిలిచినా తెలంగాణ వస్తాం.
07.55 PM
ఈ 5 గ్యారంటీలే కాదు యువత కోసం మరో 5 గ్యారంటీలు ఉన్నాయి : రాహుల్ గాంధీ
కాంగ్రెస్ వద్ద ప్రేమ, స్వచ్ఛత ఉన్నాయి. కాంగ్రెస్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది. ఈ 5 గ్యారంటీలే కాదు యువత కోసం మరో 5 గ్యారంటీలు ఉన్నాయి. మహిళల కోసం మరో 5 గ్యారంటీలు ఉన్నాయి. రైతులు, బీసీలకు కూడా మరో 5 గ్యారంటీలు ఉన్నాయి. భారత్ ముఖచిత్రాన్ని మార్చే మేనిఫెస్టో. ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో మాత్రమే కాదు-ప్రజల ఆత్మ. మా మేనిఫెస్టోను జాగ్రత్తగా పరిశీలిచండి.
07.52 PM
రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన బీజేపీ చేస్తుంది : రాహుల్ గాంధీ
'ఎలక్ట్రానిక్ బాండ్ల రూపంలో ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందని రాహుల్ గాంధీ అన్నారు. ఎలక్ట్రానిక్ బాండ్ల జాబితా చూస్తే ఏం జరిగిందో మీకే అర్థమవుతుందని తెలిపారు. ముందు సీబీఐ బెదిరిస్తుంది వెంటనే ఆ కంపెనీ బాండ్లు కొంటుంది. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలనూ స్థంభింపజేశారు. కాంగ్రెస్ బ్యాంక్ ఖాతాలనూ స్థంభింపజేసినా భయపడం. తెలంగాణలో బీజేపీ బీ టీమ్‌ను ఓడించాం. ఇప్పుడు కేంద్రంలో భాజపానే ఓడిస్తాం. బీసీ, ఎస్సీ, ఎస్టీల రక్షణ రాజ్యాంగం ద్వారానే సాధ్యం. రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన బీజేపీ చేస్తుంది. మోదీ కేవలం 3 శాతం మంది కోసం పనిచేస్తున్నారు. మోదీ వద్ద ధనం, సీబీఐ, ఈడీ ఉన్నాయి.'
07.48 PM
గత సీఎం వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేశారు : రాహుల్ గాంధీ
"గత సీఎం ఎలా పనిచేశారో మీకందరికీ తెలుసునని రాహుల్ గాంధీ అన్నారు. గత సీఎం వేలాది మంది ఫోన్లు ట్యాప్ చేయించారన్నారు. గతం సీఎం రెవెన్యూ, ఇంటిలిజెన్స్ వ్యవస్థలను దుర్వినియోగం చేశారు. ట్యాపింగ్ ఆధారాలు దొరక్కుండా నదుల్లో పడేశారన్నారు. బెదిరించి, భయపెట్టి బలవంతపు వసూళ్లుకు పాల్పడ్డారన్నారు.దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేసేందుకు జనగణన చేపడతాం. జనగణనతో ఎవరి భాగస్వామ్యం ఎంతో తేలిపోతుంది. ఆర్థిక, సంస్థాగత సర్వేలు కూడా చేపడతాం. ఈ సర్వేల ద్వారా దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉందో తేలుతుంది. అన్ని రంగాల్లో మీకు దక్కాల్సిన హక్కు మీకు దక్కుతుంది."
07.43 PM
దేశంలో జనగణన చేపడతాం : రాహుల్ గాంధీ
'జనాభాలో ఓబీసీలు 50 శాతం ఐఏఎస్‌ల్లో ఓబీసీల వాటా 3 శాతం. బడ్జెట్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ఖర్చు పెట్టేది 6 శాతమే. దేశంలో 90 శాతం జనాభాకు సరైన అవకాశాలు లేవు. దేశ సామాజిక పరిస్థితిని అంచనా వేసేందుకు జనగణన చేపడతాం. జనగణనతో ఎవరి భాగస్వామ్యం ఎంతో తేలిపోతుంది. ఆర్థిక, సంస్థాగత సర్వేలు కూడా చేపడతాం. ఈ సర్వేల ద్వారా దేశంలో సంపద ఎవరి చేతుల్లో ఉందో తేలుతుంది.'
07.41 PM
ఉపాధి హామీ కూలీలకు వేతనం పెంపు : రాహుల్
ఉపాధి హామీ కూలీలకూ వేతనం పెంపు ఉంటుందని రాహుల్ గాంధీ చెప్పారు. దేశంలో 50 శాతం జనాభా బీసీలు, 15 శాతం ఎస్సీలు ఉన్నారన్నారు. దేశంలో 8 శాతం ఎస్టీలు, 15 శాతం మైనార్టీలు ఉన్నారని తెలిపారు. దేశంలో 90 శాతం పేదలే, దేశంలో ఏ సంస్థలో చూసినా ఈ 90 శాతం మంది కనిపించరని ఆవేదన చెందారు. దేశంలోని ఏ పెద్ద కంపెనీ యజమానుల్లోనూ ఈ 90 శాతం కనిపించరన్నారు. జనాభాలో 50 శాతం ఐఏఎస్‌ల్లో 3 శాతం మాత్రమే బీసీలు ఉన్నారు. జాతీయ స్థాయిలో కనీస వేతనం రూ.400కు పెంచుతామని రాహుల్ గాంధీ అన్నారు.
07.38 PM