ETV Bharat / state

గురుకుల పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి సూసైడ్ - అదే కారణమా? - SUICIDE IN GURUKULA SCHOOL

ఫ్యాన్​కు ఊరివేసుకున్న బాలుడు - తలనొప్పిగా ఉందనడంతో తన తండ్రికి తెలియజేసిన విద్యార్థులు - తండ్రి శ్రీనివాసులు వచ్చేలోగా మృతి

Student Suicide
Social Welfare Student Suicide (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2024, 7:00 PM IST

Social Welfare Student Suicide : గురుకుల పాఠశాలలోనే ఫ్యాన్​కు ఉరి వేసుకొని ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వనపర్తి జిల్లా మదనాపురం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ బాలుర గురుకుల పాఠశాలలో కొన్నూరు గ్రామానికి చెందిన ప్రవీణ్ (12) ఏడో తరగతి చదువుతున్నాడు. మంగళవారం (నవంబర్ 26) రోజున పాఠశాల ఆవరణలో తోటి విద్యార్థులతో కబడ్డీ ఆడాడు. కబడ్డీ ఆడుతున్న సమయంలో ఇద్దరు విద్యార్థుల తలలు ఢీకొన్నాయి.

దీంతో ప్రవీణ్ అప్పటి నుంచి తల నొప్పిగా ఉందని చెప్పడంతో అక్కడ విధుల్లో ఉన్న ఉపాధ్యాయురాలు మాత్రలు ఇచ్చారు. ఉదయం పాఠశాలకు వచ్చిన తర్వాత మరో మారు మెడ, తల భాగంలో నొప్పి ఎక్కవగా వస్తుందని చెప్పడంతో ఉపాధ్యాయురాలు విద్యార్థి తండ్రి శ్రీనివాసులుకు ఫోన్ చేసి, మీ అబ్బాయికి తలనొప్పి వస్తుందని ఇబ్బంది పడుతున్నాడని చెప్పారు.

మందులిచ్చిన వైద్యుడు : తన తండ్రి ఫోన్ ప్రవీణ్​కు ఇవ్వాలని చెప్పడంతో ఆమె ఫోన్ ఇచ్చింది. తండ్రితో ఫోన్ మాట్లాడిన విద్యార్థి అక్కడి నుంచి తరగతి గదిలోకి వెళ్లాడు. తలనొప్పి ఎక్కువ కావడంతో అక్కడ విధుల్లో ఉన్న వైద్యుడికి చూయించగా, మందులు ఇచ్చి వేసుకొని డార్మెటరీపై పడుకోమని చెప్పి వెళ్లిపోయారు. విద్యార్థిని డార్మెటరీలో తన స్నేహితుడు సాయంతో ఉన్నాడు. పాఠశాలలో పరీక్షలు జరుగుతుండడంతో తోడుగా ఉన్న విద్యార్థి తాను పరీక్ష రాసి వస్తానని, నువ్వు పడుకో ప్రవీణ్ అని చెప్పి వెళ్లాడు.

పర్యవేక్షించాల్సిన సిబ్బంది ఎక్కడ? : అప్పటికే ప్రవీణ్ తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్దామని గురుకుల పాఠశాలకు వచ్చాడు. విద్యార్థి డార్మెటరీలో ఉన్నాడని చెప్పడంతో అక్కడకు వెళ్లి చూడగా, ప్రవీణ్ ఫ్యాన్​కు దుప్పటితో ఉరి వేసుకొని కనిపించాడు. వెంటనే ఇన్​ఛార్జి ప్రధానోపాధ్యాయుడు పరమేశ్వర్​ దృష్టికి తీసుకెళ్లడంతో హుటాహుటిన ప్రవీణ్​ను బంధువులతో కలిసి వనపర్తి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్లు ఘటనా స్థలికి చేరుకొని ఆరా తీశారు. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులను వెల్​నెస్ సెంటర్​లో పెట్టి పర్యవేక్షించాల్సిన సిబ్బంది విద్యార్థిని ఒంటరిగా డార్మెటరీలో విడిచిపెట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్​ ఎందుకు సూసైడ్​ చేసుకున్నాడనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఆ యువకుడి వేధింపుల వల్లే నా చిట్టితల్లి ఆత్మహత్య చేసుకుంది - భువనగిరిలో యువతి మృతిపై తండ్రి ఫిర్యాదునగ్న పూజలకు సహకరిస్తే డబ్బులిస్తాం : విద్యార్థినికి వంట మనిషి వేధింపులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.