Govt Steps To Revive Vro System : వీఆర్వో వ్యవస్థ పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారి నియామకం చేపట్టనుంది. ఈ మేరకు పాత ఉద్యోగులను మళ్లీ వీఆర్వో పోస్టులోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇతర శాఖల నుంచి తీసుకుని వీఆర్వోలుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఆసక్తి, అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ఈమేరకు ఈ నెల 28 వరకు గడువు విధిస్తూ సీసీఎల్‌ఏ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా గత ప్రభుత్వ హయాంలో అర్హులైన వీఆర్వోలను ఇతర శాఖలకు బదలాయింపు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీఆర్వోలను వెనక్కి రప్పించేందుకు చర్యలు చేపట్టింది. కలెక్టర్ల పర్యవేక్షణలో వీఆర్వోలను ఇతర శాఖలను వెనక్కి రప్పించే ప్రక్రియ జరగనున్నట్లు సమాచారం.