Congress and BRS Clash in Jagtial :జగిత్యాలలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. జగిత్యాల తహసీల్దార్ కార్యాయలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, జగిత్యాల భారత్ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరయ్యారు.
Congress and BRS Clash : ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గత ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన్ను మాట్లాడకుండా అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ సైతం హస్తం పార్టీ చెప్పిన తులం బంగారం హామీ ఏమైందంటూ ప్రశ్నించారు.ఇరువర్గాల ఆందోళనతో కొద్ది సేపు చెక్కుల పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ఈ క్రమంలోనే జీవన్‌రెడ్డి (MLC Jeevan Reddy), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలగజేసుకొని వారికి సర్దిచెప్పారు. అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు.