ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంటి ఆపరేషన్ ఫెయిల్ - పెన్షన్ సర్టిఫికెట్ ఇస్తానంటూ డాక్టర్ డీల్

కంటి శుక్లాల ఆపరేషన్ చేయించుకుంటే ఆపరేషన్ వికటించిన ఆ కన్ను తీసేసే పరిస్థితికి వచ్చిన వైనం.

eye_surgery_fail
eye_surgery_fail (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 29, 2024, 7:20 PM IST

Complaint Against Doctor After Eye Surgery Fails:ప్రభుత్వ వైద్యశాలలో కంటి ఆపరేషన్ చేయగా పరిస్థితి విషమంచి ఆమె కన్ను తొలగించే పరిస్థితికి వచ్చిన ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని అనంతసాగరం మండలం గౌరవరం గ్రామానికి చెందిన పీ.లక్ష్మమ్మ అనే మహిళకు ఈ నెల 21వ తేదీన ఆత్మకూరు జిల్లా వైద్యశాలలో కంటికి శుక్లాల ఆపరేషన్ జరిగింది. 22వ తేదీన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం కన్నుకు ఇన్ఫెక్షన్ వల్ల నీరు కారుతుండడంతో 25వ తేదీన హాస్పిటల్​కు వచ్చి పరీక్షలు చేయించుకున్నారు.

సర్జరీ చేసిన డాక్టర్ శర్వాణి వీరితో మాట్లాడుతూ కంటిలో ఏదో లోపం వల్ల ఇలా జరిగి ఉంటుందని నెల్లూరుకు పంపించారు. నెల్లూరులో వైద్యం చేయించుకుంటూ ఉండగా హాస్పిటల్​కి వచ్చిన డాక్టర్ శర్వాణి తిరుపతిలోని మరో హాస్పిటల్​కు పంపిస్తూ వారికి దారి ఖర్చులకు డబ్బులు ఇచ్చి పంపించినట్లు వారు తెలిపారు. తిరుపతి హాస్పిటల్లో పేషెంట్​ను చూపించగా అక్కడ కన్ను బాగా ఇన్ఫెక్షన్ సోకిందని ఇంజక్షన్లు వేయాలని ఒకవేళ పరిస్థితిని బట్టి కన్ను తీసేయాలి అని డాక్టర్లు తెలిపినట్లు బాధితులు తెలిపారు.

తిరుపతిలో చికిత్స పొందుతున్న ఈమెకు వైద్యం చేయించే పరిస్థితి తమకు లేదని బాధితులు వాపోతున్నారు. కంటి విషయమై ఆపరేషన్​ చేసిన డాక్టర్​కు తెలపగా కన్ను పోతే మీకు పెన్షన్ వచ్చేలా సర్టిఫికెట్లు ఇప్పిస్తానని డాక్టర్ చెప్పినట్లు బాధితులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఆత్మకూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాల ఇంచార్జ్ సూపరింటెండెంట్​కు కంటి ఆపరేషన్ చేసిన డాక్టర్​పై ఫిర్యాదు చేశారు.

'శంకర్​దాదా ఎంబీబీఎస్​'లకు ఇక చెక్ - దేశ వ్యాప్తంగా వైద్యులకు యూనిక్ ఐడీ

'గ్రూప్‌ 1 మూల్యాంకనంలో అక్రమాలు' - విచారణకు అభ్యర్థుల డిమాండ్

ABOUT THE AUTHOR

...view details