తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగినిపై మనసు పారేసుకున్న కంపెనీ సీఈవో - అమెరికా నుంచి ఇండియాకు వచ్చి మరీ వేధింపులు - Sexual harassment case In Ameerpeet

Company CEO Sexual Harassment Young Women : 'ఎంత అందంగా ఉన్నావో తెలుసా, సినిమాల్లోని హీరోయిన్​కు ఏమాత్రం తగ్గని అందం నీది' అంటూ ఓ యువతిని పొగడ్తలతో ముంచెత్తిన కంపెనీ సీఈవో, ఆమె కోసం అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధిత యువతిని వేధింపులకు గురి చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Company CEO Sexual Harassment
Company CEO Sexual Harassment Young Women

By ETV Bharat Telangana Team

Published : Feb 3, 2024, 12:01 PM IST

Company CEO Sexual Harassment Young Women in Ameerpeet : రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యాచారాలు, లైంగిక వేధింపులు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. అమ్మాయిలపై అఘాయిత్యాలు కట్టడి చేయడానికి షీ టీమ్ ఉన్నా, నేరాలు మాత్రం పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. హత్యలు, అత్యాచారాలు అరికట్టడానికి ఎంతో సాంకేతిక పరిజ్ఞానం వాడుతున్న ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం బాధాకరం. తాజాగా ఇన్పోగ్రావిటీ అనే కంపెనీకి చెందిన సీఈవో తన కంపెనీలో పని చేసే యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అమీర్​పేట్ పోలీసులకు ఫిర్యాదు అందింది.

Sexual Assault Hyderabad : తల్లితో సహజీవనం.. కుమార్తెపై లైంగిక వేధింపులు.. చివరికి..!

CEO Sexually Harassment Young Women In Hyderabad : వివరాల్లోకి వెళితే, ఎంత అందంగా ఉన్నావో తెలుసా. సినిమాల్లోని హీరోయిన్​కు ఏమాత్రం తగ్గని అందం నీది అంటూ ఓ యువతిని పొగడ్తలతో ముంచెత్తిన యువకుడు ఆమె కోసం అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత బాధిత యువతికి వేధింపులు అధికం కావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం అమీర్​పేట్​లోని ఓ కంపెనీలో మేనేజర్​గా యువతి (28) పని చేస్తుంది.

లైంగిక వేధింపులకు పాల్పడిన టీచర్​కు దేహశుద్ధి

ఇన్ఫోగ్రావిటీ కంపెనీ సీఈవో టి.చంద్ర అమెరికాలో ఉండేవాడు. సదరు యువతి ఇండియా మేనేజర్​గా పని చేస్తూ కంపెనీ వ్యవహారాలు, జూమ్ మీటింగ్​లను చక్కగా నిర్వహించేది. కంపెనీ సీఈవో జూమ్​ మీటింగ్​లు నిర్వహించినప్పుడు ఆ యువతి అందాలను పొగిడేవాడు. కంపెనీ బాస్ కావడంతో అతన్ని మందలించలేకపోయేది. దాన్ని అలుసుగా తీసుకున్న చంద్ర, మరింత రెచ్చిపోయాడు.

Sexual harassment case In Ameerpeet: ఆమె కోసం అమెరికా నుంచి హైదరాబాద్​కు వచ్చేశాడు. అమీర్​పేట్​లో మీటింగ్ ఏర్పాటు చేసి తన కంపెనీకి మేనేజర్​గా పని చేసే యువతిని పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నెక్లెస్ రోడ్డులోని ఓ రెస్టారెంట్​కు తీసుకెళ్లిన అతను, తన మనసులోని మాటను బయటపెట్టాడు. అందుకు ఆమె తిరస్కరించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. భయంతో ఐదు రోజులు ఆఫీస్​కు సెలవు పెట్టింది. తర్వాత జనవరి 8వ తేదీన ఆఫీస్​కు వచ్చిన తనను సీఈవో మరోసారి లైంగికంగా వేధించాడు.

దీంతో ఆ యువతి జనవరి 12వ తేదీన తన ఉద్యోగానికి రాజీనామా చేసింది. ఆఫీసులో చాలా సంవత్సరాలు పని చేసినందున రిలీవింగ్ లెటర్, ఎక్స్​పీరియన్స్ లెటర్, జీతం, లీగల్ సర్వీసెస్ ఛార్జెస్ డ్యూస్ ఇవ్వాలని విన్నవించుకుంది. తన లైంగిక కోరిక తీరిస్తేనే ఇస్తానని కంపెనీ సీఈవో చంద్ర మొండికేయడంతో, ఆ యువతి మధురానగర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Father Rapes Daughter Hyderabad : పదేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం.. 20 ఏళ్లు శిక్ష విధించిన కోర్టుHyderabad Rowdy Sheeter Muder Case Update : అందమైన అబ్బాయిని ఎర వేసి.. రౌడీ షీటర్​ హత్య..!

ABOUT THE AUTHOR

...view details