Collapsed bridge at Nirmal District :నిర్మల్ జిల్లాలోని కుంటాల మండలం కల్లూరు, నర్సాపూర్(జి) మండలంలోని పాత భూర్గుపెల్లి(కె) గ్రామాలను అనుసంధానం చేస్తూ 20 ఏళ్ల కిందట కల్లూరు-పేండ్‌పెల్లి వాగు కలిసే చోట ఎస్సారెస్పీ ఆధ్వర్యంలో వంతెన నిర్మించారు. ఈ బ్రిడ్జి ద్వారా పలు గ్రామాలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉండేది. నిర్మాణ లోపాలు, భారీ వర్షాలు, వరదలతో మార్చి 5తేదీన ఓ భారీ వాహనం వెళ్లిన సందర్భంలో ఓ పిల్లర్ విరిగిపోయింది. దీంతో ఆ వంతెనకు సంబంధించిన రెండు శ్లాబులు కూలిపోయాయి. వాహనదారుల, పాదచారుల దీంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
పైపు ద్వారా పాకుతూ గమ్యం చేరుకుంటున్ ప్రజలు :వంతెన వద్ద 25-30 అడుగుల మేర ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ నిల్వ ఉండటం వల్ల పాత భూరుగపల్లి(కె) వాసులు రెండు కిలోమీటర్ల దూరంలోని పొలాలకు చేరేందుకు సుమారు 15 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూలీలను, పంట ఉత్పత్తులను తరలించడం సంగతి సరేసరి. వంతెనపై మిషన్ భగీరథ పైపు ఉంది.