Coal Mines Auction 2024 : రాష్ట్రంలో నూతన బొగ్గు గనులను దక్కించుకునేందుకు కేంద్ర బొగ్గుశాఖ నిర్వహించే వేలంలో పాల్గొనాలని సింగరేణి యోచిస్తోంది. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణలో రెండు బొగ్గు గనులను ప్రైవేట్ కంపెనీలు సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు కేంద్ర బొగ్గుశాఖ మరోసారి కొత్త గనులను వేలం వేయడానికి సిద్ధమవుతున్నట్లు రాష్ట్రాలకు సమాచారమిచ్చింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరింది. ఆపై గనుల వేలం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. తెలంగాణలో కొత్తగా మరిన్ని గనులను వేలం వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వేలంలో పాల్గొని గనులను దక్కించుకోవాలని సింగరేణి కసరత్తు చేస్తోంది.
Coal Mines Bidding in Telangana : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు 2.40 లక్షల టన్నుల వరకు బొగ్గు కావాలని సింగరేణిని అడుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాజైపూర్‌లో (Jaipur Thermal Power Plant)సింగరేణికి ఇప్పటికే 1200 మెగావాట్ల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. అక్కడే మరో 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణానికి సింగరేణి టెండర్లు పిలుస్తోంది. దీంతోపాటు 800 మెగావాట్ల ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం సింగరేణికి సూచనలు చేసింది. నాలుగు సంవత్సరాల్లో పూర్తయ్యే ఈ రెండు ప్లాంట్లకు రోజూ 20,000ల టన్నుల బొగ్గు అవసరం.
యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ప్రత్యేక పాలసీ : డిప్యూటీ సీఎం భట్టి