తెలంగాణ

telangana

ETV Bharat / state

మహబూబాబాద్ జిల్లాలో 30వేల ఎకరాల్లో పంట నష్టం : సీఎం రేవంత్ - CM REVANTH VISITS MAHABUBABAD - CM REVANTH VISITS MAHABUBABAD

CM Revanth Mahabubabad District Tour Today : భారీ వర్షాలు, వరదల వల్ల సర్వం కోల్పోయిన ప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. ఇవాళ (సెప్టెంబరు 3వ తేదీ) ఉదయం మహబూబాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటించారు.

CM Revanth Mahabubabad District Tour
CM Revanth (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Sep 3, 2024, 2:06 PM IST

Updated : Sep 3, 2024, 8:06 PM IST

CM Revanth Visits Mahabubabad Flooded Areas :తెలంగాణలో గత శనివారం, ఆదివారం కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వరద సంభవించింది. ఈ జిల్లాల్లోని చాలా గ్రామాలు వరద ముంపునకు గురయ్యారు. మరోవైపు పలుచోట్ల వాగులు, చెరువులు పొంగిపొర్లాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహించడంతో వరద రహదారులు, వంతెనలపైకి చేరి చాలా ప్రాంతాల్లో అవి దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే మహబూబాబాద్ జిల్లాలోని ఆకేరు వాగుపై వంతెన కూడా దెబ్బతింది.

మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి అక్కడ జరిగిన నష్టాన్ని పరిశీలించారు. పురుషోత్తమాయ గూడెంలో పర్యటించిన ఆయన ఆకేరు వాగుపై దెబ్బతిన్న వంతెన వద్దకు వెళ్లారు. అనంతరం సీతారాం నాయక్ తండాలో వరద బాధితులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అధికారులు ఉన్నారు.

వర్షాల కారణంగా భారీ పంట నష్టం - ప్రాథమిక అంచనా రూ.415 కోట్లు - Huge Crops Loss In Telangana

30వేల ఎకరాల్లో పంట నష్టం :అనంతరం వరద నష్టంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో సీఎం సమీక్ష నిర్వహించారు. మొదట కలెక్టరేట్‌లో ఫొటో ప్రదర్శనను తిలకించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత మంత్రులు, అధికారులతో కలిసి సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహబూబాబాద్‌ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఎన్ని చర్యలు చేపట్టినా కొంత ప్రాణనష్టం జరిగింది. ప్రభుత్వ ఆస్తులు దెబ్బతినడం చాలా బాధాకరం. సచివాలయం నుంచి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నాను. మహబూబాబాద్‌లో నలుగురు మృతి చాలా బాధాకరం. దాదాపు 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. అని అన్నారు.

అధికారులకు కృతజ్ఞతలు : మరోవైపు మంత్రి సీతక్క మాట్లాడుతూ క్షేత్రస్థాయి పర్యటనలో అధికారులంతా చాలా బాగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్‌లో చాలా చోట్ల పశుసంపద కోల్పోయినవారు ఉన్నారని, విపత్తులు ఎప్పుడూ వచ్చిన సమన్వయంతో కలిసి ముందుకెళ్లాలని పేర్కొన్నారు. ఇక మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గడిచిన వందేళ్లలో 42 సెం. మీ వర్షపాతం నమోదైనా సంఘటనలు లేవని అన్నారు. వరద నష్టంపై నిన్నటి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి సమీక్షిస్తూనే ఉన్నారని చెప్పారు. అధికారులంతా అహర్నిశలు కష్టపడుతున్నారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకోవడం వల్లే ప్రాణనష్టం తక్కువగా ఉందని, రాజకీయంగా లబ్ధి కోసం మాట్లాడడం తప్ప ప్రతిపక్షం ప్రజల వద్దకు ఏనాడు రాలేదని దుయ్యబట్టారు.

'ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు - త్వరలోనే రాష్ట్రానికి ప్రత్యేక విపత్తు నిర్వహణ సంస్థ' - CM REVANTH REDDY ON FLOODS

వరద బాధితుల కోసం కదిలిన ఉద్యోగ జేఏసీ - విరాళంగా రూ.130కోట్లు - TELANGANA EMPLOYEES JAC DONATION

Last Updated : Sep 3, 2024, 8:06 PM IST

ABOUT THE AUTHOR

...view details