CM Revanth Review on Musi Development : హైదరాబాద్‌లోని చారిత్రక కట్టడాలన్నీ కలుపతూ వెళ్లేలా మూసీ అభివృద్ధికి ప్రణాళిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులకు సూచించారు. పెట్టుబడులని ఆకర్షించే స్థాయిలో అభివృద్ధి చేయాలని పర్యాటకంగా, ఆహ్లాదకరమైన ఉద్యానంగా మార్చాలని నిర్దేశించారు. మూసీ నది పరీవాహక అభివృద్ధిపై హైదరాబాద్ నానక్‌రాంగూడ హెచ్ఎండీఏ(HMDA) కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు దానకిశోర్, ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.
మూసీ(Musi River) సరిహద్దు ప్రాంత స్కెచ్‌తో పాటు పలు వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. ప్రస్తుత రెవెన్యూ రికార్డుల్లోని గ్రామపటాలు, గరిష్ఠ వరద ప్రవాహం రికార్డులను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. హద్దులను పక్కాగా గుర్తించడం, నదీ గర్భంలోని వ్యర్థాల తొలగింపు, ఇతరత్రా పనులు చేపట్టడం తదితర చర్యలపై కూలంకషంగా చర్చించారు.
హైదరాబాద్ నగరం అభివృద్ధిపై సీఎం ఫోకస్ - మూసీ నది అభివృద్ధే ప్రధానం
CM Revanth Reddy Review at HMDA : తొలుత మూసీ శుభ్రత ప్రక్రియను పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. నిరంతరం మంచినీరు పారించడం కీలకమని పేర్కొన్నారు. భవిష్యత్‌లో చక్కు మురుగైనా కలకుండా చూడాలని సూచించారు. మురుగు నీటి శుద్ధి కేంద్రాల ద్వారా వస్తున్న జలాలనే సమూసీలోకి మళ్లించడం, ఎగువ నుంచి నదిలోకి మంచినీరు వచ్చేలా రివర్ లింక్డు ప్రాజెక్టుపైనా దృష్టి పెట్టాలన్నారు. సాధ్యాసాధ్యాలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని తెలిపారు.