తెలంగాణ

telangana

ETV Bharat / state

విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌రెడ్డి - Revanth Reddy in Hyderabad

CM Revanth Reddy Returned to Hyderabad : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్‌ చేరుకున్నారు. దావోస్, లండన్, దుబాయ్‌లో పర్యటించిన ఆయన ఇవాళ నగరానికి వచ్చారు. తొలుత దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత లండన్​కు వెళ్లి అక్కడి నుంచి దుబాయ్​లో పర్యటించారు.

Revanth Reddy
Revanth Reddy

By ETV Bharat Telangana Team

Published : Jan 22, 2024, 2:05 PM IST

CM Revanth Reddy Returned to Hyderabad :విదేశీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. వారం రోజుల పాటు స్విట్జర్లాండ్‌లోని దావోస్‌తో పాటు లండన్, దుబాయ్‌లో ముఖ్యమంత్రి బృందం పర్యటించింది. ఈనెల 14వ తేదీన దిల్లీ నుంచి స్విట్జర్లాండ్ బయల్దేరిన రేవంత్‌ (CM Revanth Reddy) 15, 16, 17వ తేదీల్లో దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు కేంద్రంగా పారిశ్రామికవేత్తలతో చర్చించారు. సుమారు రూ.40,000ల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

మూసీ పునరుజ్జీవం, అభివృద్ధి కోసం ఈనెల 18, 19 తేదీల్లో లండన్‌లో థేమ్స్ నది అభివృద్ధిపై అధ్యయనంతో పాటు ప్రవాస భారతీయులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిశారు. లండన్‌ పర్యటనలో సీఎం పలు స్మారక కేంద్రాలను సందర్శించారు. ప్రపంచ ప్రసిద్ధమైన చారిత్రక కట్టడాలనూ, స్మారక కేంద్రాలను సందర్శించారు. బిగ్‌బెన్, లండన్‌ ఐ, టవర్‌ బ్రిడ్జ్‌ ఎట్‌ ఆల్‌ కట్టడాలను ఆయన తిలకించారు. ఆ దేశ పురోగతి, ఆర్థికాభివృద్ధిలో ఈ పర్యాటక కేంద్రాల పాత్రను రేవంత్‌ అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ - త్వరలోనే డిజిటల్‌ హెల్త్‌ కార్డులు

Revanth Reddy in Hyderabad : తెలంగాణలోని పలు పర్యాటక కేంద్రాల అభివృద్ధి, తద్వారా వచ్చే ఆదాయం, ఉపాధి అవకాశాల కల్పన ఎలా సాధించాలనే కోణంలో, లండన్‌లో అనుసరిస్తున్న విధానాలను రేవంత్‌రెడ్డి అధ్యయనం చేశారు. లండన్ పర్యటన అనంతరం ఆదివారం దుబాయ్‌కి వెళ్లిన రేవంత్ టీమ్ మూసీ పరీవాహకంలో అభివృద్ధి, సుందరీకరణ పనుల కోసం అంతర్జాతీయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధి సంస్థలతో చర్చించింది. దుబాయ్ పర్యటన ముగించుకున్న రేవంత్ టీమ్ హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి, శ్రీధర్‌బాబుకు శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

మూసీ విజన్ 2050 - సహకారం అందిస్తామన్న లండన్‌ టీమ్‌

బిజీబిజీగా రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటన : ఇక దావోస్‌ పర్యటనలో(Revanth Reddy Davos Tour) భాగంగా తెలంగాణలో రూ. 12,400 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ముందుకొచ్చింది. మరో పారిశ్రామిక దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ రూ.9,000ల కోట్లతో పంప్ స్టోరేజీ ప్రాజెక్టులు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఐదేళ్లలో రూ.8000ల కోట్లతో బ్యాటరీల ఉత్పత్తి సంస్థ స్థాపించి 6,000ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని గోడి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. ప్రముఖ ఫార్మా కంపెనీ ఆరాజెన్ రూ.2,000ల కోట్లతో మల్లాపూర్‌లోని పరిశ్రమ విస్తరించాలని నిర్ణయించింది.

నేనూ రైతు బిడ్డనే వ్యవసాయం మా సంస్కృతి - దావోస్​లో సీఎం రేవంత్ ప్రసంగం

రైతులకు కార్పొరేట్ తరహా లాభాలు రావాలనేదే నా స్వప్నం: సీఎం రేవంత్​

ABOUT THE AUTHOR

...view details