CM Revanth Reddy Delhi Tour :ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ వెళ్లారు. శనివారం దిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అంతేకాకుండా ఇండియా కూటమి పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్‌గా రాహుల్ గాంధీని ఎన్నుకోవడంతో పాటు, ఆయనను కలిసి అభినందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ముందు రోజే దిల్లీ వెళ్తున్నట్లు తెలుస్తోంది.
ఇవాళ రాత్రి కానీ, రేపు ఉదయం కానీ కాంగ్రెస్ పెద్దలతో సీఎం సమావేశమై, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకోనున్నారు. అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం దిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి సీఎంతో పాటు సభ్యురాలిగా దీపాదాస్ మున్షీ, ప్రత్యేక ఆహ్వానితుడిగా వంశీచంద్ రెడ్డి, శాశ్వత ఆహ్వానితుడు దామోదర్ రాజనర్సింహులు హాజరు కానున్నారు.
TPCC Focus On Nominated Posts Appointments : రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగియడంతో రాష్ట్ర సర్కార్ ఇచ్చిన హామీ మేరకు పార్టీ కోసం పని చేసిన నాయకులకు నామినేటెడ్ పదవులను కట్టబెట్టే పనిలో పడింది. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు పార్టీ నాయకులు అవిశ్రాంతంగా పని చేశారు. అభ్యర్థుల గెలుపునకు కొంతమంది పని చేస్తే, మరికొందరు నాయకులు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ కాంగ్రెస్ బలోపేతం కోసం పని చేశారు.