CM Revanth Reddy Speech in Tukkuguda :బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో, వందేళ్ల విధ్వంసం జరిగిందని, సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) దుయ్యబట్టారు. కేసీఆర్‌కు కాలు విరిగిందని, కూతురు జైలుకెళ్లిందని తాము జాలి చూపించామన్నారు. ప్రభుత్వపై ఏం మాట్లాడినా ఊరుకుంటామని కేసీఆర్ అనుకుంటున్నారని, కానీ ఏం మాట్లాడినా చూస్తు ఊరుకోవడానికి తానేమీ జానారెడ్డిని కాదని, రేవంత్‌రెడ్డినని స్పష్టం చేశారు. ఎలాబడితే అలా మాట్లాడితే కేసీఆర్‌ను(KCR) చర్లపల్లి జైల్లో పెడతామని హెచ్చరించారు. కేసీఆర్‌కు జైల్లో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ఎద్దేవా చేశారు.
ప్రజల హృదయాల నుంచి పుట్టిందే మా గ్యారంటీల పత్రం : రాహుల్ గాంధీ - Tukkuguda Congress Meeting 2024
Congress Janajathara Sabha : లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిని గెలిపించాలని, సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జూన్ 9న దిల్లీలో మువ్వెన్నల జెండా ఎగరాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ను తుక్కుతుక్కుగా ఎలా ఓడించామో, బీజేపీని(BJP) అలాగే ఓడించాలని, కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని స్పష్టం చేశారు. కార్యకర్తల కష్టం వల్లే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. గుజరాత్ మోడల్‌పై, వైబ్రెంట్ తెలంగాణ ఆధిపత్యం చూపిస్తోందని వెల్లడించారు.
ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారని, పదేళ్లలో మోదీ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా, మోదీ(PM MODI) ప్రభుత్వం పదేళ్లలో కేవలం 7 లక్షల ఉద్యోగాలు ఇచ్చారని దుయ్యబట్టారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతులు 17 నెలలు పోరాడారని గుర్తుచేశారు. నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ 750 మంది చనిపోయారని, 750 మంది రైతులు చనిపోతే బాధిత కుటుంబాలను మోదీ పరామర్శించలేదని మండిపడ్డారు.