తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుల లెక్కలు ఓకే - అమ్మకాల సంగతేంటి? - వాటిపై విచారణకు రెడీయా? : సీఎం రేవంత్ - CM REVANTH SLAMS HARISH RAO - CM REVANTH SLAMS HARISH RAO

Telangana Assembly Budget Session 2024 : అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్​రావు, అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని సీఎం రేవంత్​ రెడ్డి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన ఓఆర్​ఆర్​ను రూ.7 వేల కోట్లకు అమ్ముకుందని ఆరోపించారు.

CM Revanth Reddy speech telangana assembly budget session 2024
CM Revanth Reddy speech telangana assembly budget session 2024 (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 27, 2024, 12:04 PM IST

Updated : Jul 27, 2024, 1:09 PM IST

CM Revanth Reddy Budget Session 2024 Speech : గత ప్రభుత్వం లక్షల కోట్ల విలువైన ఓఆర్​ఆర్​ను రూ.7 వేల కోట్లకు అమ్మిందని, గొర్రెల పంపిణీ పథకంలో రూ.700 కోట్లు అవినీతి జరిగిందని సీఎం రేవంత్​ రెడ్డి ఆరోపించారు. అప్పుల లెక్కలు చెప్పిన హరీశ్​ రావు అమ్మకాల లెక్కలు చెప్పట్లేదని విమర్శించారు. బతుకమ్మ చీరలు అని సూరత్​ నుంచి కిలోల లెక్క తీసుకువచ్చి పంపిణీ చేశారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో హరీశ్​ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్​ రెడ్డి ఘాటుగా స్పందించారు.

కేసీఆర్​కు పాలమూరు జిల్లా ప్రజలు ఏం అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పదేళ్లలో పూర్తి చేయలేదని అన్నారు. కేసీఆర్​ పాలనలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల విలువైన భూములు అమ్ముకున్నారని దుయ్యబట్టారు. బతుకమ్మ చీరలు, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారా అంటూ బీఆర్​ఎస్​ నేతలను సీఎం కేసీఆర్​ ప్రశ్నించారు.

ఆడబిడ్డల సెంటిమెంట్​ను బతుకమ్మ చీరల పంపిణీ రూపంలో దోపిడీకి పాల్పడ్డారని సీఎం రేవంత్​ రెడ్డి విమర్శలు చేశారు. కురుమ, యాదవులను అమాయకులను చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని తెలిపారు. కాళేశ్వరం ఖర్చు విషయంలోనూ గతంలో ఒకటి చెప్పి ఇప్పుడు రూ.94 వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీఆర్​ఎస్​ హయాంలో ఎన్ని వేల కోట్ల విలువైన భూములు అమ్మారో లెక్క తీస్తామని హెచ్చరించారు.

"గత ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చింది. గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నా రంగారెడ్డి జిల్లాపై నిర్లక్ష్యం వహించారు. ఈ జిల్లా ఆస్తులు అమ్ముకున్నారు కానీ సాగు నీరు ఇవ్వలేదు. ప్రజలు బీఆర్​ఎస్​కు గుండు సున్నా ఇచ్చినా బుద్ధి మారకుండా ఇలా మాట్లాడటం సరైంది కాదు. బతుకమ్మ చీరలు, కేసీఆర్​ కిట్స్​, గొర్రెల పంపిణీపై విచారణకు సిద్ధంగా ఉన్నారో లేదో చెప్పాలి."- రేవంత్​ రెడ్డి, సీఎం

సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యత తనపై ఉంది : సభ్యులు మాట్లాడే తప్పును సరిచేసే బాధ్యతను తనపై ఉందని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. సభలో అబద్ధాలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. 2018 డిసెంబరు లోపల విద్యుత్​ మీటర్ల బిగిస్తామని కేసీఆర్​ కేంద్రానికి చెప్పారు. అధికారిక లెక్కలు చూసి హరీశ్​ రావు స్పందించాలని సీఎం రేవంత్​ తెలిపారు.

కేసీఆర్​ మార్క్​ను కంప్యూటర్ నుంచి తొలగించగలరేమో కానీ - ప్రజల మనసులోంచి కాదు : హరీశ్‌రావు - Harish Rao On Budget

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ త్వరగా పూర్తి చేయండి - అధికారులకు సీఎం ఆదేశం - CM Revanth on Panchayat Elections

Last Updated : Jul 27, 2024, 1:09 PM IST

ABOUT THE AUTHOR

...view details