CM Revanth Performed First Puja in Khairatabad Ganesh :ప్రతి ఏటాఖైరతాబాద్లో వినాయక చవితికి విగ్రహం ప్రతిష్ఠించి వేడుకలు చేయడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీకి నేటితో 70 ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా 70 అడుగుల ఎత్తులో సప్తముఖ మహాశక్తి గణపతిని ప్రతిష్ఠించారు. ఈ గణనాథుడిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి వినాయకుడిని దర్శించుకొని తొలి పూజ చేశారు. ఖైరతాబాద్ గణేశుడి ఉత్సవ కమిటీ సభ్యులు ముఖ్యమంత్రికి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ మండపం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో వెండి వినాయకుడు - పురవీధుల్లో ఘనంగా ఊరేగింపు - Silver Ganesha Procession
తొలి పూజ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, 'ఈ ఉత్సవాలు జరిపించడానికి ప్రభుత్వం సహకారం అందించాం. గణేశ్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్ కూడా అందించాం. ఈ ఏడాదిలో అత్యధికంగా వర్షాలు కురిశాయి. దేవుడి దయతో వరదల వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. గణేశ్ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు. గతేడాది పార్టీ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను.' అని తెలిపారు.
దేశానికే ఆదర్శం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలు :దేశంలోనే అత్యంత గొప్పగా గత 70 ఏళ్లుగా గణేశ్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ ఉత్సవ కమిటీని కొనియాడారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలను నిర్వహించడంలో పేరు గాంచింది. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని అన్నారు. ప్రభుత్వం వినాయకుడి ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అన్ని రకాలుగా రాష్టంలో 1.40 లక్షల విగ్రహాలను నెలకొల్పారు. ఖైరతాబాద్ గణేశ్ నిర్వహణ ఆదర్శంగా నిలబడిందని సీఎం రేవంత్ తెలిపారు.
ఘనంగా ప్రారంభమైన కాణిపాక వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు - Kanipaka Vinayaka Brahmotsavam
"ఈ ఉత్సవాలు జరిపించడానికి ప్రభుత్వం సహకారం అందించాం. గణేశ్ ఉత్సవాలకు ఉచిత విద్యుత్ కూడా అందించాం. ఈ ఏడాదిలో అత్యధికంగా వర్షాలు కురిశాయి. దేవుడి దయతో వరదల వల్ల ఎక్కువ నష్టం జరగలేదు. గణేశ్ ఉత్సవాలను ఇంత గొప్పగా జరిపిస్తున్న ఉత్సవ కమిటీకి ధన్యవాదాలు. గతేడాది పార్టీ అధ్యక్షుడిగా, ఈ ఏడాది సీఎంగా ఇక్కడికి వచ్చాను."- రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
తొలిపూజలు అందుకునేందుకు సిద్ధమైన బొజ్జగణపయ్య - ఊరూవాడా కోలాహలంగా ఏకదంతుని మండపాలు - VINAYAKA CHAVITHI Festival in AP