CM Revanth On Govt ITIs : పరిశ్రమల ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్‌ల సిలబస్ అప్‌గ్రేడ్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సిలబస్ మార్పునకు కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని అవసరమైతే స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని సీఎం సూచించారు. సచివాలయంలో కార్మిక, ఉపాధి శాఖ అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐ, పాలిటెక్నిక్‌ల సిలబస్ : సీఎం రేవంత్ - CM Revanth On Govt ITI - CM REVANTH ON GOVT ITI
CM Revanth Focus On ITIs : గవర్నమెంట్ ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా అభివృద్ధి పరుస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఐటీఐల సిలబస్ ఉండే విధంగా చూడాలని అధికారులకు సూచించారు. 100 నియోజకవర్గాల్లో ఐటీఐలు ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
Published : Sep 21, 2024, 7:24 PM IST
100 ఐటీఐల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి :రాష్ట్రంలో ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్నందున సిబ్బంది కొరత లేకుండా చూడాలని సీఎం తెలిపారు. పాలిటెక్నిక్ కళాశాలల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి తెలిపారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వంద నియోజకవర్గాల్లో ఐటీఐ, ఏటీసీలు ఉండేలా చర్యలు చేపట్టాలని సీఎం తెలిపారు. ఐటీఐ, ఏటీసీ, పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధి విధానాలు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.