CM Revanth Reddy on Fire Department :హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో అగ్నిమాపక శాఖ రాష్ట్ర ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అగ్నిమాపక శాఖ కేవలం అగ్ని ప్రమాదాల నివారణ కోసమే కాదని, విపత్కర పరిస్థితుల్లో కూడా వీరి సేవలు అమూల్యమని కొనియాడారు. అగ్నిప్రమాదాల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడే ఫైర్ సిబ్బంది సేవలు మరవలేనివన్నారు.
'వేసవిలో అగ్నిప్రమాదాలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం'
Revanth Inaugurated on Fire Command and Control : ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే అగ్నిమాపక శాఖకు భవనం లేకపోవడం సరికాదని రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వివరించారు. ఏ నగరంలో శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు, వైఎస్‌ఆర్, కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను తమ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డును ప్రతిపాదనను చంద్రబాబు తీసుకువచ్చారని, దాన్ని కొనసాగిస్తూ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పూర్తి చేశారని రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు.
కఠిన శిక్షలతోనే ప్రమాదాల కట్టడి.. చట్టానికి పదును పెట్టేందుకు అగ్నిమాపకశాఖ కసరత్తు..!
హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రీజినల్ రింగ్ రోడ్డును త్వరలోనే తీసుకువస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. రింగ్ రోడ్డు చుట్టూ మెట్రో రైల్ సదుపాయం కూడా కల్పిస్తామని హమీ ఇచ్చారు. తెలంగాణ అభివృద్దికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకువస్తున్నామని చెప్పారు. త్వరలో 2050 విజన్ దిశగా తాము ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. అర్బన్, రూరల్ తెలంగాణను అభివృద్ధి చేస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు.హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతోందని, ఇక్కడ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, అందుకే మహానగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్దిలో ముందుకు తీసుకెళ్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.