CM Revanth Reddy Meeting with Cabinet Sub-Committee :రాష్ట్రంలో మరో రెండు గ్యారంటీల అమలుకు ముందడుగు పడింది. గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలను ఈనెల 27 లేదా 29న ప్రారంభించనున్నట్లు, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మార్చి మొదటి వారం నుంచి విద్యుత్తు బిల్లు జారీ చేసేటప్పుడు అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లులు జారీ చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.
CM Revanth Clarifies on Two Guarantees : ప్రజాపాలన దరఖాస్తుదారుల్లో అర్హులందరికీ రూ.500కు గ్యాస్ సిలిండర్ అందించాలని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. గ్యాస్ సిలిండరుపై ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీని నేరుగా లబ్ధిదారుల ఖాతాకు బదిలీ చేయాలా? ఏజెన్సీలకు చెల్లించాలా? అనే అంశంపై పౌరసరఫరాలు, ఆర్థిక శాఖల అధికారులతో సీఎం చర్చించారు. ఎలా చేసినప్పటికీ లబ్ధిదారుడు 500 రూపాయలు చెల్లిస్తే సిలిండర్ ఇచ్చేలా ప్రజలకు అనువైన విధానాన్ని రూపొందించాలని సీఎం పేర్కొన్నారు. అవసరమైతే గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే ఏజెన్సీలతో చర్చలు జరపాలని సూచించారు. సబ్సిడీ నిధులను గ్యాస్ ఏజెన్సీలకు వెంట వెంటనే చెల్లించేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
Gruhajyothi Scheme Implementation : అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇచ్చే గృహజ్యోతి పథకాన్ని ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా అమలు చేయాలని విద్యుత్తు శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెల్ల రేషన్ కార్డున్న 200 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగించే వారందరికీ ఈ పథకం వర్తింపజేయాలని అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే నెలలో అర్హులైన వారందరికీ గృహజ్యోతి పథకం(Gruhajyothi Scheme) కింద జీరో బిల్లులే జారీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఉచిత కరెంటుతో గ్రిడ్‌పై ఎంత భారమెంత - అధ్యయనానికి కర్ణాటకకు అధికారులు